భవిష్యత్తులో హైస్పీడ్ ప్రయాణానికి కేరాఫ్ ఆఫ్ అడ్రస్‌గా హైపర్‌లూప్ నిలవనుంది. ఆ హైపర్‌లూప్‌లో ప్రయాణించిన తొలి భారతీయుడిగా పూణేకు చెందిన తనయ్ మంజ్రేకర్ రికార్డు సృష్టించాడు. యునైటెడ్ స్టేట్స్.. లాస్ వెగాస్‌లోని వర్జిన్ పరీక్షా కేంద్రంలో తనయ్ ఈ ప్రయాణం చేశాడు. 15 సెకన్ల వ్యవధిలో 170 కిలోమీటర్ల వేగంతో 400 మీటర్లు ప్రయాణించారు. ‘హైపర్ లూప్ ప్రయాణం చాలా వేగవంతమైంది. ఈ రైడ్ చాలా సున్నితంగా ఉంది. ఈ 15 సెకన్లు నా జీవితంలో మరపురాని క్షణాలు. టీం చాలా హార్డ్ వర్క్‌తో ఈ ప్రాజెక్ట్‌పై పనిచేసింది. నేను ఇందులో రైడ్ చేసినందుకు చాలా సంతోషిస్తున్నాను’ అని మంజ్రేకర్ అన్నారు. ఈ ప్రాజెక్టుపై చాలా నెలల పాటు మంజ్రేకర్ శిక్షణ పొందాడు.
For More News..