స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మానవరహిత బాంబర్ విమానం ఎఫ్ డబ్ల్యూడీ 200బీ తొలిసారిగా విజయవంతంగా గగనవిహారం చేసింది. బెంగళూరుకు చెందిన ఫ్లయిండ్ వెడ్జ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్(ఎఫ్డబ్ల్యూడీఏ) సంస్థ దీన్ని రూపొందించింది. ఈ విమానం సుమారు 15 వేల అడుగుల ఎత్తులో ఏడు గంటలపాటు నింగిలోనే ఉండగలదు. ఇది నిఘా కోసం ఆప్టికల్ పరికరాలు, గగనతల దాడులు, బాంబింగ్ కోసం క్షిపణి తరహా ఆయుధాలను మోసుకెళ్తుంది. దీని ఏరోడైనమిక్స్ డిజైన్, ఎయిర్ ఫ్రేమ్, ప్రొపల్షన్, నియంత్రణ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్స్‌ను ఎఫ్డబ్ల్యూడీఏ కర్మాగారంలోనే రూపొందించారు.
ఈ విమానం బరువు 102 కిలోలు, గరిష్టంగా 250 కిలోమీటర్లు వేగంతో ప్రయాణించగలదు.