కూసుమంచిలో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణం పూర్తి

 కూసుమంచిలో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణం పూర్తి

కూసుమంచి, వెలుగు: రాష్ట్రంలో మొదటి ఇందిరమ్మ ఇల్లు మోడల్ హౌస్ ఖమ్మం జిల్లా కూసుమంచిలో నిర్మాణం పూర్తి అయింది. తన సొంత నియోజకవర్గం పాలేరులో మోడల్ హౌస్ నిర్మాణానికి గతేడాది డిసెంబర్ 13న రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నెల రోజుల్లో నిర్మాణం పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి ఆదేశించగా, అంతకు వారం రోజులు ముందుగానే అధికారులు నిర్మాణాన్ని పూర్తి చేశారు. రూ.5 లక్షల ఖర్చుతో 600 స్క్వేర్ ఫీట్ల లో ఇంటి నిర్మాణం చేశారు.