రాష్ట్రం నుంచి పసుపులోడ్‌తో ఫస్ట్​ కిసాన్‌‌‌‌ రైలు

రాష్ట్రం నుంచి పశ్చిమ బెంగాల్‌‌‌‌కు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: వరంగల్‌‌‌‌ నుంచి పశ్చిమ బెంగాల్‌‌‌‌లోని బరసత్‌‌‌‌కు పసుపు లోడ్‌‌‌‌తో కిసాన్‌‌‌‌ రైలు సోమవారం బయల్దేరి వెళ్లింది. 10 పార్సిల్‌‌‌‌ వ్యాగన్లలో 230 టన్నుల పొడి పసుపును ఈ ట్రైన్​లో లోడ్​ చేశారు. ఇప్పటికే ఏపీ, మహారాష్ట్ర నుంచి సక్సెస్‌‌‌‌ఫుల్‌‌‌‌గా కిసాన్‌‌‌‌ ట్రైన్స్‌‌‌‌ స్టార్ట్‌‌‌‌ చేసిన విషయం తెలిసిందే. వ్యవసాయ రంగంలో మార్కెటింగ్‌‌‌‌ కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా  స్పీడ్‌‌‌‌గా ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ చేసేలా కేంద్రం కిసాన్‌‌‌‌ రైళ్లను తీసుకొచ్చింది. ఆపరేషన్‌‌‌‌ గ్రీన్స్ టాప్‌‌‌‌ టు టోటల్‌‌‌‌ స్కీమ్​ కింద కిసాన్​ రైళ్లలో గుర్తించిన పండ్లు, కూరగాయలు తరలింపునకు ఛార్చీలో50 శాతం రాయితీని ప్రకటించింది. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌‌‌‌ మాల్యా మాట్లాడుతూ కిసాన్‌‌‌‌ రైల్‌‌‌‌తో ఇస్తున్న ప్రత్యేక రాయితీలు, ఫెసిలిటీస్‌‌‌‌ను రైతులు ఉపయోగించుకోవాలని కోరారు.