జనగామ అర్బన్, వెలుగు : జనగామ జిల్లాకు అదనంగా వచ్చిన 100 బ్యాలెట్ యూనిట్లకు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సోమవారం ఫస్ట్ లెవల్ చెకింగ్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా జనగామ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య మాట్లాడుతూ స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి సంబంధించి 290 పోలింగ్ సెంటర్లకు 25 శాతం ఈవీఎం యూనిట్లను కేటాయించినట్లు తెలిపారు.
కార్యక్రమంలో అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ సుహాసిని, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉడుత రవి, రావెల రవి, విజయభాస్కర్, వెంకట మల్లయ్య, రాంప్రసాద్, కలెక్టరేట్ ఏవో పి. రవీందర్, ఈడీఎం దుర్గారావు, తహసీల్దార్ శ్రీనివాస్ పాల్గొన్నారు.