అదనపు ఈవీఎంల ఫస్ట్ లెవల్ తనిఖీ

అదనపు ఈవీఎంల ఫస్ట్ లెవల్ తనిఖీ

ఖమ్మం టౌన్, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు న్యూ కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం, వీవీ ప్యాట్ల గోడౌన్ లో చేపట్టిన అదనపు ఈవీఎంల ఫస్ట్ లెవల్ తనిఖీని జరిగింది.  గురువారం రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ పరిశీలించారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల్లో 35 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు, నోటాతో కలిపి 36 అవుతాయని కలెక్టర్​ చెప్పారు. ఒక్కో బ్యాలెట్ యూనిట్​లో 16 మంది అభ్యర్థులకు అవకాశం ఉన్నందున

ఎన్నికల నిర్వహణకు 3 బ్యాలెట్ యూనిట్ల అవసరం ఉందని చెప్పారు. ఇందుకు అదనపు ఈవీఎంలను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు బి. సత్యప్రసాద్, డి. మధుసూదన్ నాయక్, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ రాంబాబు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మైక్రో అబ్జర్వర్లు కీలకం

ఎన్నికల ప్రక్రియలో మైక్రో అబ్జర్వర్లు, జనరల్ అబ్జర్వర్ కీలకమని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల జనరల్ అబ్జర్వర్లు డాక్టర్ సంజయ్ జి కోల్టే అన్నారు. గురువారం న్యూ కలెక్టరేట్ లో మైక్రో అబ్జర్వర్లకు ఏర్పాటు చేసిన రెండో విడత శిక్షణా కార్యక్రమానికి జనరల్ అబ్జర్వర్లు హాజరై, వారికి విధులు, బాధ్యతల పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జనరల్ అబ్జర్వర్ మాట్లాడుతూ ఒకే లోకేషన్ లో ఒకటి కన్న ఎక్కువ పోలింగ్ కేంద్రాలున్న చోట మైక్రో అబ్జర్వర్ల నియామకం చేశామన్నారు.

పోలింగ్ కు ఒక రోజు ముందు మైక్రో అబ్జర్వర్లు వారి వారి నియోజకవర్గ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద ఉదయం 8 గంటలకు రిపోర్ట్ చేయాలని, అక్కడి నుంచి పోలింగ్ సిబ్బందితో కేటాయించిన కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. పోలింగ్ తర్వాత శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన రిసిప్షన్ కేంద్రంలో నివేదికలు సమర్పించాలన్నారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మైక్రో అబ్జర్వర్లకు విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించారు.

నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్ షురూ..

నేటి నుంచి జరిగే పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ఈ నెల 8 వరకు చేపడుతున్నట్లు కలెక్టర్ గౌతమ్ తెలిపారు. న్యూ కలెక్టరేట్ లో పోస్టల్ బ్యాలెట్ బృందాలకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ఓటింగ్ కు ముందే పూర్తిచేయనున్నట్లు తెలిపారు.  హోం ఓటింగ్ విషయమై సంబంధిత ఓటరుకు ముందస్తుగా సమాచారం ఇవ్వాలని చెప్పారు. ఇచ్చిన సమయానికి ఓటరు అందుబాటులో లేకుంటే, రెండోసారి ముందస్తుగా సమాచారం ఇచ్చి 
వెళ్లాలన్నారు. 

టెన్త్​ స్టూడెంట్స్​కు సన్మానం

ఉన్నత లక్ష్యం పెట్టుకొని ప్రణాళికాబద్ధంగా సాధన చేయాలని స్టూడెంట్స్​కు కలెక్టర్  గౌతమ్ సూచించారు. టెన్త్​ ఫలితాల్లో 10జీపీఏ సాధించిన 16 మంది ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులను, వారి తల్లిదండ్రులను గురువారం న్యూ కలెక్టరేట్ లో  ఆయన అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులు ప్రోత్సహించి, వారి లక్ష్య సాధనకు సహకరించాలని సూచించారు.