- యాడ్ ఫిల్మ్‌లో నటించిన మహేష్ బాబు, తమన్నా
హైదరాబాద్, వెలుగు : హావెల్స్ ఇండియా నుంచి ప్రముఖ కన్జూమర్ డ్యూరబుల్స్ బ్రాండ్ లాయిడ్ మొదటిసారి డిజైనర్ ఏసీలను పరిచయం చేసింది. ఈ డిజైనర్ లాయిడ్ ఏసీలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు టాలీవుడ్ నటుడు మహేష్ బాబు, తమన్నా భాటియాతో యాడ్స్ చేశారు. వీటిలో 'లాయిడ్ స్టెల్లార్', 'లాయిడ్ స్టైలస్' ఎయిర్ కండీషనర్ల గురించి తెలియజేయనున్నారు. ఈ ఏసీలలో మూడ్ లైటింగ్ చేంజ్ చేయగలిగే ఫాసియా వంటి అధునాతన ఫీచర్‌లు ఉన్నాయి. 'లాయిడ్ స్టెల్లార్' ఏసీ ఆంబి లైటింగ్ కలర్‌ను డైరెక్ట్ వాయిస్ కమాండ్‌తో మార్చుకోవచ్చు. 60 డిగ్రీల సెల్సియస్ వరకు సమర్థవంతమైన కూలింగ్ ను అందించగల సామర్థ్యం దీని సొంతమని కంపెనీ చెబుతోంది.