![Sumanth : అనగనగా మూవీ నుంచి సుమంత్ పస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్](https://static.v6velugu.com/uploads/2025/02/first-look-poster-of-sumanth-ott-film-anaganaga-released_kHVmETZFbL.jpg)
సుమంత్ హీరోగా సన్నీ కుమార్ రూపొందిస్తున్న చిత్రం ‘అనగనగా..’. ఈటీవీ విన్‌తో కలిసి కృషి ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఆదివారం సుమంత్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘చిన్నప్పుడు మనం చాలా కథలు వినేవాళ్లం కదా?. అవే కథలు మళ్లీ నెమరు వేయటానికి వస్తున్న మన వ్యాస్ సార్‌కి జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ ఇంప్రెస్ చేస్తోంది. ఇందులో సుమంత్ స్కూల్ టీచర్‌గా కనిపించబోతున్నాడు.
పల్లెటూరి వాతావరణంలో తన భార్య, పిల్లాడితో కలిసి స్కూటర్‌పై వెళ్తున్నట్లుగా ఉన్న పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. 2024 బీహార్ మిస్ యూనివర్స్‌గా ఎంపికైన కాజల్ రాణి ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్ విహర్ష్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈటీవీ విన్ ఓటీటీలో ఈ చిత్రం విడుదల కానుంది. మరోవైపు ‘మహేంద్రగిరి వారాహి’ అనే థ్రిల్లర్‌లో సుమంత్ నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నాడు.