చిరంజీవి .. విశ్వంభర మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను విడుదల

చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’.  తొలిచిత్రం ‘బింబిసార’తో మెప్పించిన విశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.  గురువారం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ‘ది లెజెండ్ రైజ్’ పేరుతో ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు.  ఈ పోస్టర్‌‌‌‌లో ఒక రాతిపై కూర్చొన్న చిరంజీవి, ప్రత్యేక శక్తులతో కూడిన త్రిశూలాన్ని పట్టుకుని పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌ లుక్‌‌‌‌లో కనిపించారు. 

కొండ నుంచి ఉద్భవించిన ప్రకాశవంతమైన దైవిక శక్తి,  ఉరుములు, మెరుపులతో డిజైన్ చేసిన ఈ లుక్ ఇంప్రెస్ చేసింది. ఈ చిత్రం కోసం ఓ ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టించామని, హై ఆక్టేన్‌‌‌‌ యాక్షన్ సీన్స్‌‌‌‌,  అద్భుతమైన డ్రామా, వీఎఫ్‌‌‌‌ఎక్స్ వర్క్స్‌‌‌‌తో విజువల్ వండర్‌‌‌‌‌‌‌‌గా ఉండబోతోందని మేకర్స్ చెప్పారు.  త్రిష ,  ఆషికా రంగనాథ్ హీరోయిన్స్‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో కునాల్ కపూర్ కీలకపాత్ర పోషిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్. వచ్చే ఏడాది జనవరి 10న  విడుదల కానుంది.