‘రామబాణం’లో డింపుల్ హయతి

గద్దలకొండ గణేష్‌‌, ఖిలాడీ చిత్రాలతో ఆకట్టుకున్న డింపుల్ హయతి.. ప్రస్తుతం ‘రామబాణం’ చిత్రంలో హీరోయిన్‌‌గా నటిస్తోంది. గోపీచంద్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రానికి శ్రీవాస్‌‌ దర్శకత్వం వహిస్తున్నాడు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. హోలీ, మహిళా దినోత్సవం సందర్భంగా సినిమా నుండి డింపుల్ హయాతి క్యారెక్టర్‌‌‌‌ను రివీల్ చేశారు. ట్రావెల్ బ్యాగ్ పట్టుకొని, క్యూట్‌‌ లుక్‌‌లో కనిపిస్తోంది డింపుల్. ఇందులో ఆమె భైరవి అనే పాత్రను పోషిస్తోంది. సోషల్ మెసేజ్‌‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌‌ కలగలిసిన  ఓ స్ట్రాంగ్‌‌ కంటెంట్‌‌తో సినిమా ఉండబోతోంది అంటున్నారు మేకర్స్. గోపీచంద్‌‌ ఓ డిఫరెంట్ క్యారెక్టర్‌‌‌‌లో నటిస్తుండగా, అతనికి అన్నా, వదినలుగా జగపతిబాబు, ఖుష్బు కనిపించనున్నారు. భూపతి రాజా ఈ చిత్రానికి కథను అందించగా, మిక్కీ జె మేయర్  సంగీతం అందిస్తున్నారు. సచిన్ ఖేడేకర్, నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, సమీర్, తరుణ్ అరోరా ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. మే 5న సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.