- మ. 1.30 నుంచి స్పోర్ట్ 18లో
బెంగళూరు : హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీలోని ఇండియా విమెన్స్ టీమ్ సొంతగడ్డపై సౌతాఫ్రికాతో మూడు ఫార్మాట్లలో మూడు వారాల పోటీకి రెడీ అయింది. తొలుత మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగే తొలి మ్యాచ్‌లో శుభారంభమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. జనవరిలో స్వదేశంలో ఆస్ట్రేలియా చేతిలో వన్డే, టీ20 సిరీస్‌ల్లో ఓడిన హర్మన్‌సేన ఇటీవల బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌ను 5–0తో క్లీన్‌స్వీప్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది.
అదే జోరును సఫారీలపైనా కొనసాగించాలని చూస్తోంది. గాయం కారణంగా బంగ్లాతో సిరీస్‌కు దూరమైన టాపార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్‌తో పాటు పేసర్ పూజా వస్త్రాకర్‌పై ఫోకస్ ఉండనుంది. హర్మన్, మంధాన, షెఫాలీ తమ బ్యాట్ పవర్ చూపెట్టాలని ఆశిస్తున్నారు. మరోవైపు లారా వోల్వర్ట్ కెప్టెన్సీలోని బలమైన సౌతాఫ్రికా.. ఇండియా టూర్‌ను విజయంతో ఆరంభించాలని చూస్తోంది.