ప్రపంచంలోనే బర్డ్ ఫ్లూ తొలి కేసు మెక్సికోలో నమోదు

  • బర్డ్ ఫ్లూతో మనిషి మరణం
  • హెచ్5ఎన్2 వైరస్ తో 59 ఏండ్ల వ్యక్తి మృతి 
  • ధ్రువీకరించిన డబ్ల్యూహెచ్ వో

మెక్సికో సిటీ:  బర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్లూ హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌5ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌2 వేరియంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మెక్సికోలో ఓ వ్యక్తి మరణించినట్టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ వో) వెల్లడించింది. ఈ వైరస్ వల్ల ప్రపంచంలో నమోదైన మొదటి మానవ మరణం ఇదేనని బుధవారం ప్రకటించింది. తీవ్రమైన జ్వరం, శ్వాస ఇబ్బంది, వాంతులు, డయేరియా వంటి లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన 59 ఏండ్ల వ్యక్తి బర్డ్ ఫ్లూతో మరణించినట్టు తెలిపింది. మెక్సికో సిటీలో ఏప్రిల్ 24న ఆ వ్యక్తి మరణించగా దీనిపై ఆ దేశం ఇటీవల తమకు సమాచారం అందించిందని డబ్ల్యూహెచ్ వో వెల్లడించింది.

వైరస్ సోకడానికి ముందు ఆ వ్యక్తి పౌల్ట్రీఫామ్ కు గానీ, జంతువుల వద్దకుగానీ వెళ్లిన ఆధారాలు కూడా లేవని వివరించింది. అయితే, ఆయనకు ముందే కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయని.. వాటి వల్ల పరిస్థితి మరింత దిగజారి ఉండొచ్చని మెక్సికన్ అధికారులు తెలిపారు. వైరస్ సోకడానికి 3 వారాల ముందే ఆయన అనారోగ్యం బారినపడ్డారని చెప్పారు. ఆయనకు వైరస్ ఏ విధంగా సోకిందనేది  గుర్తించలేకపోయామని పేర్కొన్నారు. మెక్సికోలోని పలు ప్రాంతాల్లోని పౌల్ట్రీలో ఈ వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గుర్తించారని, కానీ  అది మనుషులకు సోకే ప్రమాదం తక్కువని డబ్ల్యూహెచ్ వో తెలిపింది.

మరోవైపు బర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లూలోనే మరో వేరియంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌5ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌1 అమెరికా డెయిరీ ఫామ్స్ లో వ్యాపిస్తున్నట్టు గుర్తించారు. అక్కడ పని చేస్తున్న కొంతమందికి అది సోకినట్లు నిర్ధారించారు. కానీ, మనిషి నుంచి మనిషికి సోకుతున్నట్టు మాత్రం ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదు. కాగా, మెక్సికో వెస్ట్ మైకోకన్ స్టేట్ లోని ఓ ఫ్యామిలీలోనూ మార్చిలో హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌5ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌2 వైరస్ బయటపడింది. కానీ ఏప్రిల్ లోఒకరి మృతి తర్వాతే వైరస్ ఉనికిని ధ్రువీకరించారు.