ట్రంప్ పై కాల్పులు జరిపింది ఇతనే.. 20 ఏళ్ల కుర్రోడు ఎందుకిలా చేశాడు..?

ట్రంప్ పై కాల్పులు జరిపింది ఇతనే.. 20 ఏళ్ల కుర్రోడు ఎందుకిలా చేశాడు..?


అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు  ప్రపంచ వ్యాప్తంగా   కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ పై కాల్పులు జరిపిన  నిందితుడిని పెన్సిల్వేనియాలోని బెతెల్ పార్క్‌కు చెందిన  మ్యాథ్యూ క్రూక్ (20) గా గుర్తించారు. ఇవాళ క్రూక్  ఫోటోను  FBI  రిలీజ్ చేసింది.  అద్దాలు  పెట్టుకుని నవ్వుతున్నట్లు ఫోటోలో కనిపిస్తుంది.

 బట్లర్ టౌన్​లోని ఓ పార్కులో ట్రంప్ మీటింగ్ జరగగా.. దుండగుడు పక్కా ప్లాన్ ప్రకారం వేదికకు కేవలం 150 మీటర్ల దూరంలోనే ఉన్న షెడ్డులాంటి ఓ బిల్డింగ్ రూఫ్​పైకి ముందే నిచ్చెన ద్వారా చేరుకుని దాక్కున్నాడు. ట్రంప్ వేదికపైకి వచ్చి మాట్లాడుతుండగా సెమీ ఆటోమేటిక్ రైఫిల్​తో కాల్పులు జరిపాడు. అక్కడికి కొద్ది దూరంలోని ఎత్తైన ప్రాంతంలో ఉన్న ఓ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ వెంటనే దుండగుడిని గుర్తించి కాల్చి చంపాడు.  ట్రంప్ పై కాల్పులకు ముందు నిందితుడు క్రూక్ మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. అందులో రిపబ్లికన్ పార్టీ నేత ట్రంప్  ను అతను  ద్వేషిస్తున్నాడు.  
 
నిందితుడు క్రూక్  మ్యాథ్స్​లో టాప్

ట్రంప్​పై కాల్పులకు తెగబడ్డ క్రూక్స్ రిపబ్లికన్ పార్టీ మద్దతుదారుగా రిజిస్టర్ చేసుకున్నాడు. నవంబర్ లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయడానికి ఫస్ట్ టైం ఓటర్ గా నమోదయ్యాడు. అయితే, క్రూక్స్ అదే అడ్రస్ ను పేర్కొంటూ 2021లో డెమోక్రటిక్ పార్టీకి 15 డాలర్ల విరాళం ఇచ్చినట్టుగా కూడా గుర్తించారు. కాగా, పిట్స్ బర్గ్ శివార్లలోని బెథెల్ పార్క్ ఏరియాకు చెందిన క్రూక్స్ 2022లో హైస్కూల్ విద్య పూర్తి చేశాడు. గణితంపై బాగా పట్టు ఉన్న అతడు నేషనల్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఇనీషియేటివ్ నిర్వహించిన పోటీలో 500 డాలర్ల ‘స్టార్ అవార్డు’ను కూడా అందుకున్నాడు.

ALSO Read : డొనాల్డ్​ ట్రంప్​పై దాడి ఆందోళనకరం: రాహుల్

 

పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తున్న ట్రంప్ పై క్రూక్ కాల్పులు జరిపిని సంగతి తెలిసిందే..ఈ కాల్పుల్లో ట్రంప్ చెవికి గాయాలు కాగా.. మరొక వ్యక్తి చనిపోయాడు. కొందరికి గాయాలయ్యాయి. ట్రంప్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. ట్రంప్ పై దాడిని పలు దేశాల నేతలు ఖండించారు.