పోషణ పక్షోత్సవాల్లో కరీంనగర్​కు​ ఫస్ట్‌‌‌‌ ప్లేస్‌‌‌‌

కరీంనగర్ టౌన్,వెలుగు: పోషణ పక్షోత్సవాల నిర్వహణలో కరీంనగర్ ఫస్ట్ ప్లేస్ సాధించిందని  కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ పక్షోత్సవాలు శనివారం ముగిశాయి. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలతోపాటు అప్పుడే పుట్టిన శిశువు మొదలుకుని యుక్త వయస్సు వచ్చేదాకా మహిళలు పౌష్టికాహారం తీసుకోవాలన్నారు.  

పోషకాహారం ప్రాధాన్యత తెలుసుకునేందుకు మగవారికి వంటల పోటీలు నిర్వహించినట్లు వెల్లడించారు. అంతకుముందు చిన్నారులకు అన్నప్రాశన చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్,  డీడబ్ల్యూవో సరస్వతి, ఐసీడీఎస్‌‌‌‌, పోషణ్​ అభియాన్ సిబ్బంది పాల్గొన్నారు.                                      

నష్టపరిహారం అందించేందుకు కృషి 

గన్నేరువరం, వెలుగు : అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందేలా కృషి చేస్తామని కలెక్టర్ పమేలా సత్పతి భరోసా ఇచ్చారు. ఇటీవల కురిసిన వానలకు గన్నేరువరం మండలం పారువెల్ల, కాసంపేట గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అకాల వర్షాలతో పొద్దుతిరుగుడు, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయని, పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చూస్తామని  రైతులు అధైర్య పడవద్దన్నారు. కలెక్టర్‌‌‌‌‌‌‌‌ డీఏవో శ్రీనివాస్, ఏవో కిరణ్మయి,  తహసీల్దార్‌‌‌‌‌‌‌‌ భిక్షపతి, ఎంపీడీవో శంకర్, రైతులు ఉన్నారు.