ప్రపంచంలోనే తొలి పోర్టబుల్​ హాస్పిటల్​

ప్రపంచంలోనే తొలి పోర్టబుల్​ హాస్పిటల్​

భారత ఆర్మీ, వాయుసేన సంయుక్తంగా ప్రపంచంలోనే తొలి పోర్టబుల్​ హాస్పిటల్​ను విజయవంతంగా ఒక మారుమూల ప్రాంతానికి డెలివరీ చేశాయి. సొంతంగా తయారు చేసిన ఈ పోర్టబుల్​ హాస్పిటల్​ను 15 వేల అడుగుల ఎత్తు నుంచి ఐఏఎఫ్​కు చెందిన రవాణా విమానం ద్వారా అనుకొన్న లక్షిత ప్రాంతంలో ప్యారాచూట్​ సాయంతో జారవిడిచింది.

మారుమూల ప్రాంతాల్లో ఆపత్కాల పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడే లక్ష్యంలో భాగంగా నిర్వహించిన ఈ ఆపరేషన్​లో ట్రామా కేర్​ సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఆరోగ్య మైత్రి హెల్త్​ క్యూబ్​లను తరలించారు. 

ప్రాజెక్ట్​ బీహెచ్​ఐఎస్​హెచ్ఎం (భారత్​ హెల్త్​ ఇనీషియేటివ్​ ఫర్​ సహయోగ్​, హిత, మైత్రి)లో భాగంగా ఈ హెల్త్​ క్యూబ్​ (పోర్టబుల్​ హాస్పిటల్) లను దేశీయంగా అభివృద్ధి చేశారు. ఈ పోర్టబుల్​ హాస్పిటల్​ను తరలించేందుకు ఐఏఎఫ్​ అధునాతన వ్యూహాత్మక సి–130జే సూపర్​ హెర్క్యులస్​ రవాణా విమానాన్ని వినియోగించింది. ఈ ఆపరేషన్​లో ఆర్మీకి చెందిన పారా బ్రిగేడ్​ కీలక పాత్ర పోషించింది.