
కర్నూల్: దేశంలోని మొదటి పెద్ద ప్రైవేట్ గోల్డ్ మైన్‌లో వచ్చే ఏడాది అక్టోబర్ నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ కానుంది. ఆంధ్రప్రదేశ్‌లోని జొన్నగిరి (కర్నూల్) లో ఉన్న ఈ గోల్డ్ మైన్‌ను లిస్టెడ్ కంపెనీ దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ ఎక్స్‌ప్లోర్ చేస్తోంది. జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్‌లో పైలెట్ విధానంలో ఇప్పటికే ప్రొడక్షన్ మొదలయ్యిందని కంపెనీ ఎండీ హనుమా ప్రసాద్ అన్నారు. పూర్తి స్థాయిలో ప్రొడక్షన్ స్టార్టయితే ఏడాదికి 750 కిలో గ్రాముల గోల్డ్‌ను ఉత్పత్తి చేస్తామని చెప్పారు. బీఎస్‌ఈలో లిస్ట్ అయిన మొదటి గోల్డ్ ఎక్స్‌ప్లొరేషన్ కంపెనీ దక్కన్ గోల్డ్ మైన్స్.
జియోమైసూర్ సర్వీసెస్ ఇండియాలో ఈ కంపెనీకి 40 శాతం వాటా ఉంది. జొన్నగిరిలో ప్రైవేట్ గోల్డ్‌మైన్‌ను జియోమైసూర్ డెవలప్ చేస్తోంది. ఇప్పటి వరకు రూ.200 కోట్లు ఇన్వెస్ట్ చేశామని, నెలకు కేజీ గోల్డ్‌ను ఉత్పత్తి చేస్తున్నామని దక్కన్ గోల్డ్ మైన్స్ వెల్లడించింది. ‘ఇండియాలో జొన్నగిరి ప్రాజెక్ట్ కన్‌స్ట్రక్షన్ జరుగుతోంది. వచ్చే ఏడాది అక్టోబర్–నవంబర్ నాటికి ఈ మైన్‌లో పూర్తి స్థాయిలో ప్రొడక్షన్ మొదలవుతుంది’ అని ప్రసాద్ పేర్కొన్నారు.
‘ఈ మైన్‌కు 2013 అనుమతులు ఇచ్చారు. మొత్తం ఎక్స్‌ప్లొరేషన్ పూర్తవ్వడానికి 8–10 ఏళ్లు పట్టింది’ అని అన్నారు. కిర్గిజిస్తాన్‌లోని ఓ గోల్డ్‌మైన్ ప్రొజెక్ట్‌లో ప్రొడక్షన్ వచ్చే ఏడాది అక్టోబర్ లేదా నవంబర్‌లో మొదలవుతుందని ప్రసాద్ వివరించారు.