ప్రైవేట్‌రంగ అంతరిక్ష సంస్థ స్పేస్ఎక్స్ తొలిసారి అంతరిక్షంలో ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్లో ఫాల్కన్–9 రాకెట్‌ను వినియోగించి ఆగస్టు 26న ప్రైవేట్ స్పేస్ వాక్‌ను నిర్వహించనున్నది. ఈ ప్రాజెక్టు పోలారిస్ డాన్ గా పేరుపెట్టారు. ఈ ప్రాజెక్టు కింద నలుగురు వ్యోమగాములను స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సుల్ సాయంతో భూకక్ష్యలోకి పంపనున్నారు.
ఈ మొత్తం మిషన్‌కు వ్యాపారవేత్త జేర్డ్ ఇస్సాక్‌మన్ నేతృత్వం వహిస్తున్నారు. అమెరికా ఎయిర్‌ఫోర్స్ మాజీ ఉద్యోగి స్కాట్ కిడ్ దీనికి పైలట్‌గా వ్యవహరిస్తారు.ఈ మిషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) సమీపంలో ఆగదు. కానీ భూమికి దాదాపు 700 కిలోమీటర్ల ఎత్తులోకి వ్యోమగాములను తీసుకెళ్లి భూ ప్రదక్షిణ చేయనున్నది.
గతంలో అపోలో మిషన్లు మాత్రమే మానవులను అంత ఎత్తుకు తీసుకెళ్లాయి. ఆ తర్వాత మరేతర ప్రాజెక్టులు మానవులను ఇంత ఎత్తుకు తీసుకెళ్లలేదు. పోలారిస్ మిషన్‌లో తలపెట్టిన మూడు మానవ సహిత యాత్రల్లో ఇది మొదటిది.ఈ ప్రాజెక్టులో మొత్తం స్పేస్ఎక్స్ పరికరాలనే వినియోగిస్తారు. మూడు యాత్రలకు ఇస్సాక్‌మన్ నిధులను సమకూరుస్తున్నారు.