లక్సెట్టిపేట, వెలుగు: సినీ నటుడు బ్రహ్మానందం జన్మదినాన్ని పురస్కరించుకొని చాగంటి ఆర్ట్ అకాడమీ హన్మకొండ వారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో లక్సెట్టిపేట పట్టణానికి చెందిన నూటెంకి ప్రణవ దీప్తికి డ్రాయింగ్ విభాగంలో ఫస్ట్ ప్రైజ్దక్కింది.
ఈ నేపథ్యంలో ఆదివారం బ్రహ్మానందం ఇంట్లో ఆయన చేతుల మీదుగా యువతి బహుమతి అందుకుంది. ఈ కార్యక్రమంలో అకాడమీ చైర్మన్ చాగంటి మంజుల శేష బ్రహ్మం పాల్గొన్నారు.