బంజారా బిర్యానీకి ఫస్ట్ ప్రైజ్

ఢిల్లీలో ముగిసిన ఆది మహోత్సవ్

న్యూఢిల్లీ, వెలుగు: సెంట్రల్ ట్రైబల్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఢిల్లీలో 15 రోజుల పాటు నిర్వహించిన ఆది మహోత్సవ్ ఎగ్జిబిషన్ లో స్పెషల్ ఫుడ్ గా నిలిచిన తెలంగాణ వంటకం ‘బంజారా బిర్యానీ’కి ఫస్ట్ ప్రైజ్ దక్కింది. తమిళనాడు నీలగిరి స్పెషల్స్,  ఒడిశా తపాడియా రోటీలకు సెకండ్, థర్డ్ ప్రైజ్ లు వచ్చాయి. సోమవారం ఎగ్జిబిషన్ ముగింపు వేడుకల్లో ఈ అవార్డులను అందజేశారు. తెలంగాణ స్టాల్ ను ఏర్పాటు చేసిన ఆర్.అశోక్.. ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్ మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(టీఆర్ఐఎఫ్ఈడీ) ఎండీ ప్రవీర్ కృష్ణ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. దాదాపు 20 రాష్ట్రాల వంటకాలు పోటీలో ఉండగా, బంజారా బిర్యానీ స్పెషల్ ఫుడ్ గా నిలిచింది. 2019లోనూ బంజారా బిర్యానీకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది.

For More News..

స్కాలర్​షిప్​ అప్లికేషన్లకు మార్చి 31 వరకు చాన్స్

జాగాల్లేవ్.. పైసల్లేవ్.. మొక్కలెట్ల నాటాలె?

ఫండ్స్ ఇయ్యకపోతే ఉద్యమమే