పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల .. మొదటి పంప్​ డ్రైరన్ ​సక్సెస్

కొల్లాపూర్ , వెలుగు: పాలమూరు– రంగారెడ్డి ప్యాకేజీ –-1 వద్ద  మొదటి పంప్​డ్రై రన్​ సక్సెస్​ అయ్యింది. నాగర్​కర్నూల్​జిల్లా నార్లాపూర్​వద్ద ఆదివారం ఇరిగేషన్​ స్పెషల్​ చీఫ్​ సెక్రటరీ రజత్​కుమార్, ఇరిగేషన్​ అధికారుల సమక్షంలో డ్రై రన్​ నిర్వహించారు. ఈ నెల15 వరకు అన్ని పనులు పూర్తి చేసి వెట్​రన్​నిర్వహించాలని ఆదేశించారు. వారం రోజుల తేడాతో ఏదుల, వట్టెం..అక్టోబర్​3 వరకు కరివెన రిజర్వాయర్లను 2 టీఎంసీల చొప్పున నీటితో నింపాలని ఆదేశించారు. మొదట స్విచ్​యార్డ్,400 కేవీ సబ్​స్టేషన్ ను పరిశీలించిన రజత్ కుమార్​కరెంట్​చార్జింగ్​పనులు, మొదటి మోటార్​పంప్​కు కరెంట్​సరఫరా ఏర్పాట్లపై సమీక్షించారు. తర్వాత పూజలు నిర్వహించి మోటార్​ స్టార్ట్​ చేశారు. డ్రై రన్​సక్సెస్​ కావడంతో ఇంజనీర్లను అభినందించారు.

టెన్షన్​ పెట్టించిన నీళ్లు..

డ్రై రన్​కు అన్ని సిద్ధం చేసిన అధికారులు ముహూర్తం కోసం వేచి చూస్తుండగాపంప్​ హౌస్​ పై నుంచి నీళ్లు జారడంతో అధికారులు టెన్షన్​ పడ్డారు. అప్రమత్తమైన టెక్నికల్​స్టాఫ్​నీళ్లు ఎటు నుంచి వస్తున్నాయో గుర్తించి వాటిని నియంత్రించారు. ప్రభుత్వ ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి, ఈఎన్సీ మురళీ ధర్​ రావు, సీఈ హమీద్, ఎస్ఈలు, ఈఈలు, పాల్గొన్నారు.

45 రోజులలో కరివెన రిజర్వాయర్ కు సాగునీరు

కందనూలు, వెలుగు : పాలమూరు-, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన కరివెన రిజర్వాయర్ కు 45 రోజుల్లో సాగునీటిని తీసుకొస్తామని రాష్ట్ర నీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. ఆదివారం మహబూబ్​నగర్  జిల్లా పరిధిలోని కరివెన రిజర్వాయర్ కు సంబంధించిన మిషన్ భగీరథ  పైప్​ లైన్ మార్పిడి పనులను బిజినేపల్లి మండలం వట్టెం వద్ద పరిశీలించారు. అనంతర మీడియాతో మాట్లాడుతూ మూడు వారాల్లో మొదటి మోటార్ ద్వారా పంపింగ్ చేస్తామని తెలిపారు. నిబంధనల మేరకు ముందుగా నార్లాపూర్, ఏదుల, వట్టెం రిజర్వాయర్లను నింపి, ఆ తరువాత 45 రోజుల్లో కరివెన రిజర్వాయర్ కు సాగునీటిని తీసుకువస్తామని తెలిపారు. మిషన్  భగీరథకు సంబంధించి వట్టెం వద్ద పైప్​ మార్చే సమస్యతో పాటు కుడికిల్ల వద్ద ఉన్న డీప్  కట్  సమస్యను పరిష్కరించి సాగునీటిని తీసుకొస్తామని చెప్పారు.