Delhi Results: తొలి ఫలితం విడుదల.. కోండ్లి స్థానం నుంచి ఆప్ అభ్యర్థి గెలుపు

Delhi Results: తొలి ఫలితం విడుదల.. కోండ్లి స్థానం నుంచి ఆప్ అభ్యర్థి గెలుపు

ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్ లో తొలి ఫలితం విడుదలైంది.  తొలి విజయం ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతాలో పడింది. కోండ్లీ స్థానం నుంచి ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ గెలిచారు. మొత్తం 12 రౌండ్లలో 6293 ఓట్ల మెజారిటీతో ఫస్ట్ విన్ ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతాలో వేశారు. ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ప్రియాంక గౌతమ్ పై  కుల్దీప్ కుమార్ గెలుపొందారు. తొలి ఫలితం కింద ఆప్ బోణీ కొట్టడంతో ఆప్ కార్యర్తలు కోండ్లి నియోకవర్గంలో సంబరాలు చేసుకుంటున్నారు.

రౌండ్ రౌండ్ కు ఉత్కంఠ రేపుతున్న ఢిల్లీ ఫలితాల్లో బీజేపీ లీడింగ్ లో కొనసాగుతోంది. మొత్తం 70 స్థానాల్లో బీజేపీ 46 స్థానాల్లో ముందంజలో ఉండగా.. ఆప్ 24 స్థానాల్లో లీడ్ లో ఉంది. దాదాపు విజయం ఖాయం అయ్యిందని బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. 

ALSO READ | ఢిల్లీలో బీజేపీ సంబరాలు షురూ.. సాయంత్రం ప్రధాని మోడీ హాజరు