రాష్ట్రంలో ఫస్ట్ రౌండ్‌‌ వ్యాక్సిన్‌‌ 2,67,246 మందికి

రాష్ట్రంలో ఫస్ట్ రౌండ్‌‌ వ్యాక్సిన్‌‌ 2,67,246 మందికి

ఒక్క హైదరాబాద్‌‌లోనే 76 వేల మందికి

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో ఫస్ట్‌‌ రౌండ్‌‌లో 2 లక్షల 67 వేల 246 మందికి కరోనా వ్యాక్సిన్ వేయాలని హెల్త్​ డిపార్ట్​మెంట్​ నిర్ణయించింది. ఇందులో ప్రభుత్వ దవాఖాన్లలో పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు ఇతర హెల్త్ కేర్ వర్కర్లు లక్షా 25 వేల ఏడుగురు ఉండగా.. ప్రైవేట్‌‌ దవాఖాన్లలో పనిచేస్తున్న వారు లక్షా 42 వేల 239 మంది ఉన్నారు. వాళ్ల వివరాలన్నింటినీ వ్యాక్సిన్‌‌ కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొవిన్ సాఫ్ట్‌‌వేర్‌‌‌‌లో అప్‌‌లోడ్ చేస్తున్నారు. ఇందులోని వివరాల ప్రకారం ఫస్ట్ రౌండ్‌‌లో వ్యాక్సిన్‌‌ తీసుకుంటున్న వాళ్లలో హైదరాబాద్‌‌లో పనిచేస్తున్న వాళ్లే 76 ,804 మంది ఉన్నారు. తర్వాత రంగారెడ్డిలో 25,211 మంది ఉన్నారు. ఆదిలాబాద్‌‌లో అత్యల్పంగా 1,235 మందికి వ్యాక్సిన్​ వేస్తారు. వ్యాక్సినేషన్‌‌కి రెండు రోజుల ముందే.. వీరిలో ఎవరికి ఏ సెంటర్‌‌‌‌లో, ఏ టైమ్‌‌కి వ్యాక్సిన్ వేస్తరో మొబైల్ నంబర్‌‌‌‌కి మెసేజ్ ఇస్తారు. ఆ సెంటర్‌‌‌‌ లోనే వ్యాక్సిన్ వేయించుకోవాల్సి ఉంటుంది. అయితే కొన్ని ప్రైవేట్‌‌ హాస్పిటళ్ల మేనేజ్​మెంట్లు ఇప్పటికీ తమ ఉద్యోగుల డేటా ఇవ్వలేదని.. వారివి కూడా సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు. అలాగే గవర్నమెంట్ హెల్త్ ప్రోగ్రామ్స్‌‌లో పనిచేస్తున్న స్టాఫ్‌‌కు కూడా ఫస్ట్ రౌండ్‌‌లో ఇవ్వాలని భావిస్తున్నారు. వీళ్లను కూడా కలిపితే ఫస్ట్ రౌండ్‌‌లో వ్యాక్సిన్ తీసుకునేవారి సంఖ్య 3 లక్షల వరకూ ఉండొచ్చునని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.

సోమవారం నుంచి ట్రైనింగ్

కేంద్రం సూచనల మేరకు కరోనా వ్యాక్సినేషన్‌‌ కోసం రాష్ట్ర హెల్త్​ డిపార్ట్​మెంట్​ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఒకట్రెండు రోజుల్లో వ్యాక్సినేషన్ గైడ్‌‌లైన్స్ రాబోతున్నాయి. వ్యాక్సిన్ స్టోరేజ్, ట్రాన్స్‌‌పోర్ట్‌‌, వ్యాక్సినేషన్ వంటి అన్ని వివరాలు ఇందులో ఉంటాయి. వీటిపై సోమవారం నుంచి రాష్ట్ర హెల్త్​ డిపార్ట్​మెంట్​ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించనుంది. హైదరాబాద్‌‌లోని పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్‌‌లో వారం రోజుల పాటు జరగనున్న ఈ ట్రైనింగ్ సెషన్‌‌లో ఒక్కో జిల్లా నుంచి ఎనిమిది మందికి వ్యాక్సినేషన్‌‌పై శిక్షణ ఇవ్వనున్నారు. తర్వాత జిల్లాల్లో వ్యాక్సినేటర్లకు వాళ్లు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లలో వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాలు పెట్టాలని భావిస్తున్నారు. ఒక్కో పీహెచ్‌‌సీలో నాలుగైదు సెంటర్లు పెట్టాలని నిర్ణయించారు. కరోనా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత అరగంట పాటు వ్యాక్సినేషన్ సెంటర్లోనే ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ ఏవైనా నెగెటివ్ రియాక్షన్ వస్తే వెంటనే ట్రీట్‌‌మెంట్ ఇచ్చేలా  జిల్లా హాస్పిటళ్లు, టీచింగ్ హాస్పిటళ్లలో డాక్టర్ల టీమ్స్‌‌ సిద్ధంగా ఉంటాయి.

For More News..

అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ లేనట్టేనా? ఆందోళనలో ఇంటర్ స్టూడెంట్లు

రిజిస్ట్రేషన్లు పాత పద్ధతి అని హైకోర్టుకు చెప్పి.. కొత్త పద్ధతిలో ప్రారంభించిన సర్కార్

రోడ్ల రిపేర్లకు పైసా ఇయ్యని సర్కారు

కేసీఆర్ రెండేండ్ల పాలన నేటితో పూర్తి.. బయటకు రాలే.. బాధలు పట్టించుకోలే