‘హీరో’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా.. తన రెండో సినిమాగా ‘దేవకీ నందన వాసుదేవ’ చిత్రంలో నటిస్తున్నాడు. ‘గుణ 369’ ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు ప్రశాంత్ వర్మ కథను అందించాడు. నల్లపనేని యామిని సమర్పణలో సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. శుక్రవారం అశోక్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ప్రొమోను రిలీజ్ చేశారు.
‘ఏమయ్యిందే గుండెకు.. ఏనాడు లేదే ఇంత ఉలుకు.. నీ వల్లే కాదని అనకు.. ఏమయ్యిందో తెలిసే వరకు’ అంటూ సాగిన ప్రొమో సాంగ్ ఆకట్టుకుంది. భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన ఈ పాటకు సురేష్ గంగుల క్యాచీ లిరిక్స్ రాశారు. ఈశ్వర్ దత్ పాడాడు. ఫుల్ సాంగ్‌ను త్వరలో రిలీజ్ చేయనున్నారు. మరోవైపు అశోక్ బర్త్‌డే సందర్భంగా మరో కొత్త మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలో తను హీరోగా నటించనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీతో కూడిన పోస్టర్ డిజైన్ ఆకట్టుకుంటోంది. ఉద్భవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో ‘మ్యాడ్’ ఫేమ్ శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇతర వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.