సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు భారత్ ప్రయోగించిన తొలి సోలార్ అబ్జర్వేటరీ మిషన్ ఆదిత్య L1కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక అప్ డేట్ ప్రకటిం చింది. 2024 జనవరి మొదటి వారంలో అంతరిక్ష నౌక దాని గమ్యస్థానమైన లాగ్రాంజ్ పాయింట్ L1 వద్దకు చేరుకునేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. మిషన్ ప్రారంభమైన కొన్ని నెలల తర్వాత భూమినుంచి 1.5 మిలియన్ కిలోమీటర్లు ప్రయాణించిన ఆదిత్య L1 సూర్యునిపై అధ్యయనం చేసేందుకు లక్ష్యాస్థానమైన లాగ్రాంజ్ పాయింట్ L1 కు చేరుకునేందుకు అంత్యంత చేరువలో ఉంది.
ఆదిత్య L1 తన పేలోడ్స్ ద్వారా పని మొదలుపెట్టింది. ఇటీవల సూర్యునిఉపరితలానికి సంబంధించిన కీలకమైన చిత్రాలను సంగ్రహించింది. ఈ ఫొటోలు 200-400nm తరంగ ధైర్ఘ్య ప్రాంతంలో ఆదిత్య L1 అల్ట్రా వయోలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ (SUiT) పరికరంతో షూట్ చేసింది. ఈ తరంగధైర్ఘ్యం పరిధిలో SUIT సూర్యుని ఫోటోస్పీయర్, క్రోమోస్పియర్ ఫొటోలను పొందడానికి అనేక రకాల శాస్త్రీయ ఫిల్టర్లను ఉపయోగించింది. ఇస్రో తెలిపిన దాని ప్రకారం.. భూవాతావరణంపై సౌర కిరణ ప్రభావంపై పరిశోధనలు ద్వారా అయాస్కాంతీకరించబడిన సౌర వాతావరణం డైనమిక్ ఇంటర్ ప్లే ను శోధించేందుకు ఈ పరిశీలనలు శాస్త్రవేత్తలకు ఉపయోగపడతాయి.
మరోవైపు ఇస్రో చేపట్టిన మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్ యాన్ సంబంధించి కీలక అప్ డేట్ అందించారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్.2024లో క్రూ మాడ్యుల్, అబార్ట్ సిస్టమ్ పరీక్షలు నిర్వహించునున్నట్లు తెలిపారు. గగన్ యాన్ మిషన్ ద్వారా 2024-25 మధ్య అంతరిక్షంలోకి భారతీయ వ్యోమగాములను పంపాలని లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి హైలైట్ చేశారు.