
ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్‌లో శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న చిత్రం ‘కుబేర’. రష్మిక హీరోయిన్. బాలీవుడ్ నటుడు జిమ్ సర్ఫ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు కలిసి నిర్మిస్తున్నారు. జూన్ 20న సినిమా రిలీజ్ కానుంది. మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. ఫస్ట్ సాంగ్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈనెల 20న పాట విడుదల కానుండగా, మంగళవారం ప్రోమోను విడుదల చేశారు. ‘పోయిరా పోయిరా.. పోయిరా మావ.. అరె రాజాలాగ దర్జాగా పోయిరా మావ’ అంటూ సాగిన ప్రొమో సాంగ్ ఆకట్టుకుంది.
దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేయగా భాస్కరభట్ల లిరిక్స్ రాశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో ధనుష్ డిఫరెంట్ లుక్‌లో ఇంప్రెస్ చేస్తున్నాడు. విజిల్ వేస్తూ డ్యాన్స్ చేస్తున్న స్టిల్ ఆకట్టుకుంది. ఐదు భాషల్లో రిలీజ్ చేయనున్న ఈ పాటను తెలుగు, తమిళ భాషల్లో ధనుష్ స్వయంగా పాడాడు. ఇప్పటికే ఈ సినిమాలోని నాలుగు ప్రధాన పాత్రలను పరిచయం చేయడంతో పాటు విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచింది.