నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘నా సామి రంగ’. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఆషికా రంగనాథ్ హీరోయిన్. సంక్రాంతికి సినిమా రిలీజ్ కానుంది. దీంతో మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.
ఆస్కార్ అవార్డ్ విన్నర్స్ కీరవాణి పాట కంపోజ్ చేయగా, చంద్రబోస్ క్యాచీ లిరిక్స్ రాశారు. రామ్ మిరియాల పాడాడు. ‘బెల్లం సెరుకు సూపుల దాన.. అల్లం మిరప మాటల దాన.. బొండు మల్లి నడుము దాన.. బండెడు సోకుల ఓ నెరజాన.. నువ్వట్టా పోతుంటే.. నేనిట్టా సూత్తుంటే.. ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే పిల్ల.. ఎత్తుకెళ్లిపోవాలపిస్తుందే’ అంటూ సాగిన పాటలో నాగార్జున, ఆషికా రంగనాథ్ ట్రెడిషినల్ లుక్‌లో ఇంప్రెస్ చేస్తున్నారు.
వీళ్లిద్దరి జోడీ, డ్యాన్స్ మూమెంట్స్‌తో పాటు విలేజ్ బ్యాక్‌డ్రాప్ విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. దర్శకుడు కరుణకుమార్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి ప్రసన్నకుమార్ బెజవాడ కథ, డైలాగ్స్ అందిస్తున్నాడు.