NZ vs SL 2024: అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరు రోజుల టెస్ట్ మ్యాచ్.. కారణం ఏంటంటే..?

NZ vs SL 2024: అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరు రోజుల టెస్ట్ మ్యాచ్.. కారణం ఏంటంటే..?

అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ అంటే 5 రోజులు జరుగుతుంది. కొన్ని దేశవాళీ క్రికెట్ లో నాలుగు రోజులకే పరిమితమవుతుంది. కానీ అంతర్జాతీయ క్రికెట్ లో చాలా సంవత్సరాల తర్వాత ఆరు రోజుల టెస్ట్ మ్యాచ్ జరగనుంది. శ్రీలంక వేదికగా న్యూజిలాండ్  రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ సెప్టెంబర్ 18 నుంచి 23 వరకు జరుగుతుందని శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారికంగా తెలియజేసింది. దేశంలో అధ్యక్ష ఎన్నికల కారణంగా సెప్టెంబర్ 21 న మ్యాచ్ జరగడం లేదు. ఆ రోజును విశ్రాంతిగా ప్రకటించారు. 

ALSO READ | Test cricket: ఏడాదిలో మూడు బ్లాక్ బస్టర్ సిరీస్‌లు.. టెస్ట్ క్రికెట్ ఆదరణ పెరిగేనా..?

తొలి రెండు రోజుల తర్వాత మ్యాచ్ కు ఒక రోజు గ్యాప్ ఉండబోతుంది. ఆ తర్వాత 22, 23, 24 తేదీల్లో మ్యాచ్ కొనసాగుతుంది. రెండో టెస్ట్ యధావిధిగా 5 రోజుల్లోనే జరుగుతుంది. చివరిదైన రెండో టెస్ట్ సెప్టెంబర్ 26న ప్రారంభం కానుంది. వరల్డ్  ఛాంపియన్ షిప్ లో భాగంగా ఇరు జట్లకు ఈ సిరీస్ కీలకంగా మారనుంది. ప్రస్తుతం శ్రీలంక ఇంగ్లాండ్ వేదికగా మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. మరోవైపు న్యూజిలాండ్ ఎలాంటి అంతర్జాతీయ సిరీస్ ఆడడం లేదు. టెస్ట్ మ్యాచ్ ఆరు రోజులు జరగడం ఇదే తొలిసారి కాదు. ఇంగ్లండ్‌లో అనేక మ్యాచ్‌లు ఆరు రోజుల పాటు జరిగాయి. 

న్యూజిలాండ్, శ్రీలంక టెస్ట్ సిరీస్ షెడ్యూల్:

తొలి టెస్టు: సెప్టెంబర్ 18-23, గాలె

రెండో టెస్టు: సెప్టెంబర్ 26-30, గాలె