తొలి దశ ఉద్యమం : బిట్ బ్యంక్

తొలి దశ ఉద్యమం : బిట్ బ్యంక్
  •     1969, జనవరి 5న ఖమ్మం జిల్లా పాల్వంచలోని థర్మల్​ స్టేషన్​లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. 
  •     ఖమ్మం జిల్లా ఇల్లెందు పట్టణానికి చెందిన రామదాసు అనే యువకుడు పాల్వంచ థర్మల్​ కేంద్రంలో జరిగిన అన్యాయాలను మొదట వెలుగులోకి తెచ్చాడు. 
  •     పాల్వంచ థర్మల్​ పవర్​ స్టేషన్​లో దినసరి వేతన కార్మికుడు కృష్ణ నిరాహార దీక్ష ప్రారంభించాడు. 
  •     1969, జనవరి 8న పాల్వంచ పట్టణంలోని గాంధీచౌక్​ వద్ద బీఏ విద్యార్థి రవీంద్రనాథ్​ నిరాహార దీక్ష ప్రారంభించారు. 
  •     1969, జనవరి 8న పాల్వంచ పట్టణంలో రవీంద్రనాథ్​ అనే బీఏ విద్యార్థితోపాటు ఖమ్మం మున్సిపాలిటీ వైస్​ చైర్మన్​ కవిరాజమూర్తి నిరాహార దీక్షలో                        పాల్గొన్నారు. 
  •     1969, జనవరి 19న నిజామాబాద్​ పట్టణంలో పాఠశాలలు, కాలేజీలు బహిష్కరించి, విద్యార్థులు నిరసన ప్రదర్శన చేశారు. 
  •     ఖమ్మంలో రవీంద్రనాథ్​తోపాటు 9 సంవత్సరాల విద్యార్థిని అనురాధ కూడా నిరాహార దీక్ష ప్రారంభించారు. 
  •     1969, జనవరిలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అన్ని కాలేజీల విద్యార్థి సంఘాల సర్వసభ్య సమావేశం జరిగింది. 
  •     1969, జనవరి 15 నుంచి సమ్మె చేయాలని విద్యార్థి సంఘాలు నిర్ణయించాయి. 
  •     1967లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు జైపాల్​రెడ్డి నాయకత్వంలో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సమ్మె చేశారు. 
  •     ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1969, జనవరి 13న తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితి ఏర్పడింది. మల్లికార్జున్​ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు.
  •     ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరే తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితికి నిజాం కాలేజీ కేంద్ర స్థానంగా ఉంది.
  •     తెలంగాణ రక్షణలను కోరే విద్యార్థి వర్గానికి కోఠిలోని వివేకవర్ధిని కాలేజీ కేంద్రంగా నిలిచింది.
  •     1969, జనవరి 16న విద్యార్థులు హైదరాబాద్​లో ఊరేగింపులు జరిపారు. 
  •     స్వాతంత్ర్య సమరయోధుడు  కాటం లక్మీనారాయణ తెలంగాణ పరిరక్షణల కమిటీ చైర్మన్​గా వ్యవహరించారు. 
  •     ముల్కీ నిబంధనలు అటానమస్​ సంస్థలు, కార్పొరేషన్లకు వర్తించవని హైకోర్టు తీర్పునివ్వడంతో జనవరి 16న పాల్వంచ పట్టణంలో ఉద్యమం తీవ్రమైంది. 
  •     ఉద్యమంలో భాగంగా హైదరాబాద్​ నగరంలో విద్యార్థులపై 1969, జనవరి 18న మొదటిసారి లాఠీఛార్జీ జరిగింది. 
  •     తెలంగాణలో పనిచేస్తున్న ఆరు వేల మంది నాన్​ ముల్కీలు ఆంధ్రాకు వెనక్కి పంపకపోతే ప్రత్యక్ష కార్యచరణకు దిగుతామని ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యోగులు 1969, జనవరి 18న అల్టిమేటం ఇచ్చారు. 
  •     ఉద్యమం నేపథ్యంలో 1969, జనవరి 19న అఖిలపక్ష ఒప్పందం జరిగింది. 
  •     అఖిలపక్ష ఒప్పందం ప్రకారం లెక్కలు తీయగా తెలంగాణలో పనిచేస్తున్న నాన్​ ముల్కీల సంఖ్య 4500 మందిగా తేలారు. 
  •     నాన్​ ముల్కీలను ఆంధ్రాకు తరలించడానికి 1969, జనవరి 21న ప్రభుత్వం జీవో నం 36 జారీ చేసింది. 
  •     జీవో నంబర్​ 36ను ఆంధ్రప్రదేశ్​ మాజీ సీఎం దామోదరం సంజీవయ్య వ్యతిరేకించారు. 
  •     జీవో 36 ను సవాల్​ చేస్తూ ఆంధ్రా ఉద్యోగులు 1969, జనవరి 29న హైకోర్టులో రిట్​ దాఖలు చేశారు. 
  •     ముల్కీ నిబంధనలు చెల్లవు అని, జీవో 36ను రద్దు చేస్తూ 1969, ఫిబ్రవరి 3న హైకోర్టు సింగిల్​ జడ్జి జస్టిస్​ చిన్నపరెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. 
  •     ముల్కీ నిబంధనలు సక్రమమేనని, అవి చెల్లుతాయని హైకోర్టు డివిజన్​ బెంచ్​ 1969, ఫిబ్రవరి 20న తీర్పు ఇచ్చింది. 
  •     1969, జనవరి 19న జరిగిన అఖిలపక్ష ఒప్పందంలో భాగంగా బ్రహ్మానందరెడ్డి  ప్రభుత్వం తెలంగాణ మిగులు నిధుల కోసం కుమార్​ లలిత్​ కమిటీ ఏర్పాటు          చేసింది. 
  •     కుమార్​ లలిత్​ కమిటీ లెక్క ప్రకారం 1956 నుంచి 1968 మధ్య తెలంగాణపై ఖర్చు పెట్టాల్సి ఉండి ఖర్చు పెట్టకుండా రూ.34.10కోట్లు మిగిలిపోయాయి. 
  •     1969 ఉద్యమంలో తొలి అమరుడు మెదక్​ జిల్లా సదాశివపేటకు చెందిన శంకర్​.