అమెరికాలో ఫస్ట్ తెలుగు మహిళా జడ్జ్ ఈమెనే

అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు మహిళా అరుదైన ఘనత సాధించింది. కాలిఫోర్నియాలోని శాక్రమెంటో  కౌంటీ హైకోర్టులో విజయవాడకు చెందిన బాడిగ జయ జడ్జ్ గా నియమించబడ్డారు. ఈమె బిజినెస్ మ్యాన్, మచిలీపట్నం మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ కూతురు. ఆయనకు ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. జయ మూడవ కుమార్తె. జడ్జ్ కంటే ముందు జస్టిస్ జయ అదే కోర్టుకు కమిషనర్ గా  పనిచేశారు. 

ఈమె ఉస్మానియా యూనివర్సటీలో BA పొలిటికల్ సైన్స్,  సైకాలజీ చదివింది. తర్వాత యూస్ వెళ్లి బోస్టన్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ కమ్యూనికేషన్ లో మాస్టర్స్ చేశారు. శాంటా క్లారా విశ్వవిద్యాలయం నుంచి లా డిగ్రీ చదివారు. 2009లో కాలిఫోర్నియా స్టేట్ బార్ కౌన్సిల్ ఎగ్జామ్ లో అర్హత సాధించి, లా ప్రాక్టిస్ చేశారు.