హష్మతుల్లా డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంచరీ

హష్మతుల్లా డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంచరీ

బులవాయో : హష్మతుల్లా షాహిది (246), రహమత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షా (234) డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంచరీలకు తోడుగా అఫ్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జజాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (113) కూడా సెంచరీ బాదడంతో .. అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జింబాబ్వే మధ్య సోమవారం ముగిసిన తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రా అయ్యింది. దీంతో రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 0–0తో సమంగా ఉంది. 515/3 ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కోరుతో ఐదో రోజు ఆట కొనసాగించిన అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 197 ఓవర్లలో 699 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. రహమత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాతో మూడో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 364 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జత చేసిన హష్మతుల్లా..

అఫ్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో నాలుగో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 211 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోడించాడు. ఈ క్రమంలో అఫ్గాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరఫున టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో అత్యధిక స్కోరు చేసిన తొలి బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా హష్మతుల్లా రికార్డులకెక్కాడు. బెన్నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 5 వికెట్లు తీశాడు. తర్వాత జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 34 ఓవర్లలో 142/4 స్కోరు చేసింది. బెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కరన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (41), సీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విలియమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (35 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ఫర్వాలేదనిపించారు.