స్టేట్‌బ్యాంక్ లాభం 14 వేల కోట్ల పైనే
బ్యాంక్ చరిత్రలో ఇదో రికార్డు
పూర్తి ఏడాది లాభం రూ.14,488 కోట్లు
ఇంత లాభం రావడం ఇదే తొలిసారి
ఎస్‌బీఐ కార్డు ఐపీఓ వల్ల భారీ ఆదాయం
తగ్గిన మొండిబకాయిలు
ముంబై: స్టేట్ బ్యాంక్ ఫలితాలు ఎనలిస్టుల అంచనాలను మించిపోయాయి. మనదేశంలోనే అతిపెద్దది అయిన ఈ బ్యాంకు 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.14,288 కోట్ల లాభం సాధించింది. ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన నాలుగో క్వార్టర్‌లో రూ.3,581 కోట్ల లాభం వచ్చింది. గత ఏడాది ఇదే క్వార్టర్‌లో వచ్చిన లాభం రూ.838 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ. క్రెడిట్‌కార్డ్ యూనిట్ వాటా అమ్మడం వల్ల బ్యాంకుకు రూ.2,731 కోట్లు వచ్చాయి. అందుకే క్యూ4 లాభాలు భారీగా పెరిగాయని ఎక్సేంజీ ఫైలింగ్‌లో స్టేట్‌బ్యాంకు వెల్లడించింది. బ్యాంకు అసెట్ క్వాలిటీ మెరుగుపడింది. మొత్తంలోన్లలో మొండిబాకీల శాతం సీక్వెన్షియల్‌గా 6.94 శాతం నుంచి 6.15 శాతానికి తగ్గింది. మొండిబాకీల కేటాయింపులు 31.4 శాతం తగ్గి రూ.11,894 కోట్లుగా రికార్డయ్యాయి.
భారీగా పెరిగిన షేర్లు
ఫలితాల కారణంగా స్టేట్ బ్యాంక్ షేర్లు శుక్రవారం భారీగా లాభపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈలో ఎస్‌బీఐ షేర్లు 8.73 శాతం పెరిగి రూ.189.24లకు చేరుకున్నాయి. ఉదయం సెషన్ నుంచే షేర్ల దూకుడు కనిపించింది. ఈసారి లాభాలు భారీగా వస్తాయని ఇన్వెస్టర్లు ముందుగానే ఊహించడం ఇందుకు కారణం. ఇటీవలి ఎస్‌బీఐ ఐపీఓ వల్ల బ్యాంకుకు భారీగా లాభాలు వచ్చాయి కాబట్టి క్యూ4 రిజల్ట్స్ బాగుంటాయని ఎనలిస్టులు ఇది వరకే ప్రకటించారు. ఇదిలా ఉంటే పబ్లిక్ ఆఫర్ లేదా బాండ్ల ప్రైవేట్ ప్లేస్మెంట్ మార్గంలో దాదాపు రూ.11,330 కోట్లను సేకరించాలని అనుకుంటున్నట్టు స్టేట్‌బ్యాంక్ తెలిపింది. ఈ నెల 11న జరగనున్న బోర్డు మీటింగ్‌లో ఈ ప్రపోజల్‌పై డైరెక్టర్లు చర్చిస్తారని బ్యాంకు వర్గాలు వివరించాయి.
For More News..