తగ్గేదేలే.. 147 ఏళ్లలో ఇదే తొలిసారి.. రికార్డు సృష్టించిన నితీష్ , సుందర్..

 తగ్గేదేలే.. 147 ఏళ్లలో ఇదే తొలిసారి.. రికార్డు సృష్టించిన నితీష్ , సుందర్..

మెల్ బోర్న్ టెస్టులో భారీ స్కోరు చేసి పెద్ద టార్గెట్ ఇచ్చామన్న ఊపులో ఉన్న ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టుకు షాక్ ఇచ్చారు ఆల్ రౌండర్స్ నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్. టాప్ ఆర్డర్ నిరాశ పరచిన సందర్భంలో 8, 9 స్థానాలలో వచ్చిన ఇద్దరు కుదురుకొని ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. హైద్రాబాద్ కుర్రాడు నితీష్ 176 బంతులు ఎదుర్కొని 105 రన్స్ చేసి మెల్ బోర్న్ టెస్టులో తన డబ్యూ సెంచరీని నమోదు చేశాడు. సీరీస్ అంతా కూడా తనదైన ఆటతో ఆదుకుంటూ వస్తున్న నితీశ్ తన మెయిడెన్ సెంచరీతో మహామహుల ప్రశంసలు అందుకున్నాడు. 

అయితే 8, 9 వ స్థానంలో వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ రికార్డు సృష్టించారు. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో  8, 9 వ స్థానంలో వచ్చిన ప్లేయర్స్ ఇద్దరూ 150 బాల్స్ ఆడటం ఇదే తొలిసారి. ఈ ఇద్దరు యువ ఆల్ రౌండర్లు చెరో 150 బంతులు ఆడి రికార్డు క్రియేట్ చేశారు. 

నితీష్ 176 బాల్స్ ఆడి 105 రన్స్ చేయగా.. సుందర్ 162 బంతులు ఫేస్ చేసి 50 రన్స్ చేశారు. టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఈ స్థానాలలో వచ్చిన ప్లేయర్లు ఇన్ని బంతులు ఎదుర్కోవడం ఇదే తొలిసారి. అదికూడా ఆస్ట్రేలియా గడ్డపై మనోళ్లు ఇంత సహనంతో బాల్స్ ఫేస్ చేసి నిలబడటం నిజంగా గొప్పవిషయమే. 

ఆస్ట్రేలియా గడ్డపై మెయిడెన్ టెస్టు చేసిన 3వ ఆటగాడు నితీష్:

ఈ టెస్టులో నితీష్ కుమార్ రెడ్డి మరో ఫీట్ అందుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో మెయిడెన్ సెంచరీ నమోదు చేసిన మూడవ ఆటగాడిగా రికార్డుకెక్కాడు. గతంలో ఆసీస్ గడ్డపై తొలి టెస్టులోనే సెంచరీ బాదిన లిస్టులో సచిన్, రిషబ్ పంత్ ఉన్నారు.