
2జీబీ ఉన్న ఒక సినిమా డౌన్ లోడ్ కావాలంటే.. కనీసం కొన్ని నిమిషాలైనా పడుతుంది! జస్ట్ ఒక్క క్షణం.. వన్ సెకన్ లో సినిమా డిస్క్ లోకి ఎక్కేస్తే ..! అవును, 5జీతో సాధ్యమే అది. ఇలా కన్ను మూసి తెరిచేలోపు సినిమా డౌన్ లోడ్ అయిపోతుందన్నమాట. ప్రపంచంలోనే తొలిసారిగా దక్షిణ కొరియా సూపర్ ఫాస్ట్ 5జీ మొబైల్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించబోతోంది. శుక్రవారం నుంచే అక్కడి జనానికి 5జీ పరిచయం కాబోతోంది. ఇప్పుడున్న 4జీతో పోలిస్తే 5జీ డేటా వేగం 20 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), వర్చువల్ రియాలిటీ (వీఆర్) పరికరాలకూ నెట్ ను వేగంగా అందించేందుకు 5జీ దోహ దపడనుంది. స్మార్ట్ సిటీలు,అటానమస్ కార్ల రంగం అభివృద్ధికి సహకరిస్తుందని ఆ దేశ ప్రభుత్వం భావిస్తోంది.అంతేగాకుండా ఆరేళ్ల కనిష్ట స్థా యికి పడిపోయిన దేశ ఆర్థిక వృద్ధీ పెరుగుతుందని ఆశిస్తోంది. దక్షిణ కొరియా టాప్ ఆపరేటర్లైన ఎస్కే టెలికాం , కేటీ కార్ప్ సంస్థలు ఇప్పటికే పలు ఆఫర్లతో జనానికి దగ్గరవుతు న్నాయి. హువావే ఫోన్లలో తమ 5జీనెట్ వర్క్ పనిచేయదని ఆ రెండు సంస్థలు తేల్చి చెప్పాయి.