టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆరుదైన రికార్డుకు చేరువులో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక టీ20లు ఆడిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించేందుకు కేవలం ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. ఇప్పటివరకు 149 మ్యాచ్‌లు ఆడిన రోహిత్.. అఫ్గానిస్థాన్‌తో జనవరి 14వ తేదీ ఆదివారం జరిగే రెండో టీ20తో ఈ ఘనత అందుకోనున్నాడు.
ఈ లిస్టులో కింగ్ విరాట్ కోహ్లీ 115 మ్యాచ్‌లతో 11వ స్థానంలో ఉన్నాడు. చాలాకాలం తర్వాత టీ20 మ్యాచ్ ఆడిన రోహిత్ దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. దీంతో రెండో టీ20లో రోహిత్ భారీ ఇన్నింగ్స్ ఆడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇరు జట్లమధ్య రెండో టీ20 మ్యాచ్ జనవరి 14న ఇండోర్ వేదికగా రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్ లో టీమిండియా 31తో ముందంజలో ఉంది.
అత్యధిక టీ20లు ఆడిన టాప్ 10 ఆటగాళ్లు
రోహిత్ శర్మ (భారత్) - 149
పాల్ స్టిర్లింగ్ (ఐర్లాండ్) - 134
జార్జ్ డాక్రెల్ (ఐర్లాండ్) - 128
షోయబ్ మాలిక్ (పాకిస్థాన్) - 124
మార్టిన్ గప్తిల్ (న్యూజిలాండ్) - 122
మహ్మదుల్లా (బంగ్లాదేశ్) - 121
మహ్మద్ హఫీజ్ (పాకిస్థాన్) -119
టిమ్ సౌథీ (న్యూజిలాండ్) - 118
షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్) - 117
డేవిడ్ మిల్లర్ - 116