- యూఎన్ జీఏ ప్రసంగంలో ప్రస్తావించని టర్కీ ప్రెసిడెంట్
న్యూయార్క్: జమ్మూకాశ్మీర్ విషయంలో టర్కీ ప్రెసిడెంట్ రిసెప్ తయ్యిప్ ఎర్దోగన్ సైలెంట్ అయ్యారు. మంగళవారం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్ జీఏ)ని ఉద్దేశించి అరగంట పాటు ప్రసంగించిన ఆయన గాజాలో ఇజ్రాయెల్ దాడులు, మానవతా సంక్షోభం గురించి తప్ప కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించలేదు. జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక అధికారాలను కల్పించే ఆర్టికల్ 370ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2019లో రద్దు చేసినప్పటి నుంచీ యూఎన్ జీఏ సమావేశాల్లో వరుసగా ప్రతి ఏడాదీ ఎర్దోగన్ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు.
కాశ్మీర్ సమస్యపై భారత్, పాకిస్తాన్ చర్చలతో పరిష్కరించుకోవాలని సూచనలు చేశారు. దీంతో గత నాలుగేండ్లుగా తుర్కియేతో భారత్ సంబంధాలపై కొంత ప్రతికూల ప్రభావం పడింది. అయితే, భారత్ వ్యవస్థాపక దేశంగా ఉన్న బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) కూటమిలో చేరేందుకు తుర్కియే ప్రయత్నిస్తోంది. వచ్చే నెలలో భారత్ బ్రిక్స్ సమిట్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలోనే భారత్ పై ఎర్దోగన్ తన వైఖరిని మార్చుకున్నారని, అందుకే యూఎన్ జీఏ తాజా సమావేశంలో ఆయన కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించలేదని భావిస్తున్నారు.