భళా.. బంగ్లా: తొలిసారి అండర్‌‌-19 వరల్డ్‌‌కప్‌‌ టైటిల్‌‌ సొంతం

భళా.. బంగ్లా: తొలిసారి అండర్‌‌-19 వరల్డ్‌‌కప్‌‌ టైటిల్‌‌ సొంతం

 ఫైనల్లో ఓడిన ఇండియా
యశస్వి జైస్వాల్‌‌ శ్రమ వృథా

పోచెఫ్‌‌‌‌స్ట్రూమ్‌‌‌‌: చూడటానికి కుర్రాళ్లే అయినా.. అతిపెద్ద విజయంతో బంగ్లాదేశ్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ను ఊపేశారు..! ఎవరికీ అందని స్థాయిలో.. ఎవరూ ఊహించని రీతిలో అండర్‌‌‌‌–19 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ టైటిల్‌‌‌‌ను సొంతం చేసుకుని దేశ క్రికెట్​ చరిత్రను తిరగరాశారు..! ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ షోతో అదరగొడుతూ.. ఆదివారం జరిగిన మెగా ఫైనల్లో 3 వికెట్ల తేడాతో (డక్‌‌‌‌వర్త్‌‌‌‌ లూయిస్‌‌‌‌ పద్ధతి) పటిష్టమైన ఇండియాపై గెలిచారు. దీంతో ఏ స్థాయి  క్రికెట్‌‌‌‌లోనైనా తొలి వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ను దేశానికి అందించి ఔరా అనిపించారు. ముందుగా బ్యాటింగ్‌‌‌‌ చేసిన ఇండియా 47.2 ఓవర్లలో 177 రన్స్​కు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్‌‌‌‌ (121 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 88), తిలక్‌‌‌‌ వర్మ (65 బంతుల్లో 3 ఫోర్లతో 38) రాణించారు. వర్షం వల్ల బంగ్లాదేశ్‌‌‌‌ టార్గెట్‌‌‌‌ను 46 ఓవర్లలో 170 రన్స్‌‌‌‌గా నిర్దేశించారు. దీనిని బంగ్లా 42.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పర్వేజ్‌‌‌‌ హోస్సేన్‌‌‌‌ ఇమాన్‌‌‌‌ (47), కెప్టెన్‌‌‌‌ అక్బర్‌‌‌‌ అలీ (43 నాటౌట్‌‌‌‌) కీలక పాత్ర పోషించారు. అక్బర్‌‌‌‌ అలీకి ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’, జైస్వాల్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద సిరీస్‌‌‌‌’ అవార్డులు లభించాయి.

జైస్వాల్‌‌‌‌ ఒక్కడే..

టాస్‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌కు దిగిన ఇండియాను.. బంగ్లా బౌలర్లు ఎక్కడికక్కడ కట్టడి చేశారు. ఓపెనర్‌‌‌‌ జైస్వాల్‌‌‌‌ మరోసారి సూపర్‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌ చేసినా.. ప్రత్యర్థి బౌలింగ్‌‌‌‌ నైపుణ్యం ముందు మిగతా వారు తేలిపోయారు. ఓపెనింగ్‌‌‌‌ స్పెల్‌‌‌‌లో షోరిఫుల్‌‌‌‌ ఇస్లామ్‌‌‌‌ (2/31), తన్‌‌‌‌జిమ్‌‌‌‌ హసన్‌‌‌‌ షకీబ్‌‌‌‌ (2/28) రన్స్‌‌‌‌ నిరోధించడంలో సూపర్‌‌‌‌ సక్సెస్‌‌‌‌ అయ్యారు. ఫలితంగా తొలి 10 ఓవర్లలోపే సక్సేనా (2) వికెట్‌‌‌‌ కోల్పోయిన ఇండియా 23 రన్స్‌‌‌‌ మాత్రమే చేసింది. మూడో సీమర్‌‌‌‌ అవిశేక్‌‌‌‌ దాస్‌‌‌‌ (3/40) మ్యాచ్‌‌‌‌ మిడిల్‌‌‌‌ ఓవర్లను పూర్తిగా కంట్రోల్‌‌‌‌ చేశాడు. అయితే వన్‌‌‌‌డౌన్‌‌‌‌లో తిలక్‌‌‌‌ వర్మ మెరుగ్గా ఆడాడు. జైస్వాల్‌‌‌‌తో రెండో వికెట్‌‌‌‌కు 93 రన్స్‌‌‌‌ జోడించడంతో ఇన్నింగ్స్‌‌‌‌ కాస్త కోలుకుంది. ఫుల్‌‌‌‌ లెంగ్త్‌‌‌‌ బాల్స్‌‌‌‌తో ఇరువైపులా స్వింగ్‌‌‌‌ చేసిన షోరిఫుల్‌‌‌‌, షకీబ్‌‌‌‌.. ఇండియా బ్యాట్స్‌‌‌‌మన్‌‌‌‌పై స్లెడ్జింగ్‌‌‌‌కు కూడా దిగారు. దీనికితోడు బంగ్లా ఫీల్డింగ్‌‌‌‌ కూడా అద్భుతంగా ఉండటంతో రన్స్‌‌‌‌ కోసం టీమిండియా బ్యాట్స్‌‌‌‌మన్‌‌‌‌ శ్రమించాల్సి వచ్చింది. 29వ  ఓవర్‌‌‌‌లో తిలక్‌‌‌‌ వర్మ ఔట్‌‌‌‌ కాగా, కొద్దిసేపటికే కెప్టెన్‌‌‌‌ ప్రియమ్‌‌‌‌ గార్గ్‌‌‌‌ (7) నిర్లక్ష్యపు షాట్‌‌‌‌కు మూల్యం చెల్లించుకున్నాడు. దీంతో 114 రన్స్‌‌‌‌కే ఇండియా 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ధ్రువ్‌‌‌‌ జురెల్‌‌‌‌ (22)తో కలిసి ఇన్నింగ్స్‌‌‌‌ చక్కదిద్దే ప్రయత్నంలో జైస్వాల్‌‌‌‌.. పేస్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో దూకుడుగా ఆడలేకపోయాడు. చివరకు 40వ ఓవర్‌‌‌‌లో షోరిఫుల్‌‌‌‌ బాల్‌‌‌‌ను ఫుల్‌‌‌‌షాట్‌‌‌‌ కొట్టబోయి మిడ్‌‌‌‌ వికెట్‌‌‌‌లో తన్‌‌‌‌జిద్‌‌‌‌కు చిక్కాడు. తర్వాతి బాల్‌‌‌‌కు సిద్ధేశ్‌‌‌‌ వీర్‌‌‌‌ (0) ఔట్‌‌‌‌కావడంతో వికెట్ల పతనం వేగంగా సాగింది. రెండోఎండ్‌‌‌‌లో జురెల్‌‌‌‌కు సరైన సహకారం దక్కలేదు. ఆరుగురు సింగిల్‌‌‌‌ డిజిట్‌‌‌‌కే పరిమితం కావడంతో ఇండియా తక్కువ స్కోరుకే పరిమితమైంది.

ఇద్దరే కీలకం..

చిన్న టార్గెట్‌‌‌‌ను కాపాడుకోవడానికి ఆరంభంలో ఇండియా బౌలర్లు బాగా కష్టపడ్డారు. ముఖ్యంగా రవి బిష్ణోయ్‌‌‌‌ (4/30) మ్యాజిక్‌‌‌‌ టర్న్‌‌‌‌తో బంగ్లా టాప్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌ను ఇబ్బందిపెట్టాడు. పర్వేజ్‌‌‌‌ రిటైర్డ్‌‌‌‌హర్ట్‌‌‌‌గా వెళ్లి.. మళ్లీ వచ్చి బంగ్లాను ఆదుకున్నాడు. లేకపోతే సీన్‌‌‌‌ మరోలా ఉండేది. తొలి వికెట్‌‌‌‌కు 50 రన్స్‌‌‌‌ జోడించిన తన్‌‌‌‌జిద్‌‌‌‌ హసన్‌‌‌‌ (17)ను ఔట్‌‌‌‌ చేసిన బిష్ణోయ్‌‌‌‌.. వరుస విరామాల్లో హసన్‌‌‌‌ జాయ్‌‌‌‌ (8), తౌహిద్‌‌‌‌ హ్రిదోయ్‌‌‌‌ (0), షెహదత్‌‌‌‌ (1) సింగిల్‌‌‌‌ డిజిట్‌‌‌‌కే పరిమితం చేశాడు. దీంతో ఓ దశలో బంగ్లా 65 రన్స్‌‌‌‌కే 4 కీలక వికెట్లు కోల్పోయి ఎదురీత మొదలుపెట్టింది. ఓ ఎండ్‌‌‌‌లో అక్బర్‌‌‌‌ అలీ పోరాటం మొదలుపెట్టినా.. రెండో ఎండ్‌‌‌‌లో మిశ్రా (2/25).. షమీమ్‌‌‌‌ (7), అవిశేక్‌‌‌‌ (5)ను ఔట్‌‌‌‌ చేయడంతో స్కోరు 102/6గా మారింది. కానీ రిటైర్డ్‌‌‌‌హర్ట్‌‌‌‌ నుంచి వచ్చిన పర్వేజ్‌‌‌‌, అక్బర్‌‌‌‌తో కలిసి.. ఇండియా బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. చేయాల్సిన రన్‌‌‌‌రేట్‌‌‌‌ తక్కువగా ఉండటంతో భారీ షాట్లకు పోకుండా నెమ్మదిగా ఆడారు. ఏడో వికెట్‌‌‌‌కు 41 విలువైన రన్స్‌‌‌‌ జోడించిన పర్వేజ్‌‌‌‌ను.. 32వ ఓవర్‌‌‌‌లో జైస్వాల్‌‌‌‌ ఔట్‌‌‌‌ చేయడంతో ఆశలు రేగాయి. కానీ టెస్ట్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ను తలపించేలా ఆడిన అక్బర్‌‌‌‌, రకీబుల్‌‌‌‌ (9 నాటౌట్‌‌‌‌) మ్యాచ్‌‌‌‌ను చివరివరకు తీసుకొచ్చారు. విజయానికి మరో 15  రన్స్​దూరంలో వర్షం రావడంతో టార్గెట్‌‌‌‌ను సవరించారు. 30 బాల్స్‌‌‌‌లో 7 రన్స్‌‌‌‌ చేయాల్సిన దశలో రకీబుల్‌‌‌‌ ఫోర్‌‌‌‌ కొట్టి గెలిపించాడు.