భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక.. రాములోరి గుడి చుట్టూ నీళ్లు

గోదావరి నది ఎగువన, రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో పోటెత్తుతోంది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలకు అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వద్ద నదికి వరద పోటెత్తుతోంది. 

గంటగంటకు అనూహ్య రీతిలో వస్తున్న వరదతో ముంపు ప్రాంతాల ప్రజలు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. జులై 26 మధ్యాహ్నం వరకు నది నీటి మట్టం 44.4 అడుగులకు చేరినట్లు ఆఫీసర్లు చెప్పారు. 

ALSO READ :జీహెచ్ఎంసీ హై అలర్ట్.. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్.. టోల్ ఫ్రీ నెంబర్ ప్రకటన

దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మరో నాలుగు అడుగులు పెరిగి 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు అధికారులు చెప్పారు. భద్రాచలం వద్ద గోదావరి నుంచి 9 లక్షల క్యూసెక్కులకు పైగా వరద దిగువకు ప్రవహిస్తోంది. 

హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. అత్యవసరమైతే తప్పా ఇళ్ల నుంచి బయటకి రావొద్దని సూచిస్తున్నారు.  ఆగస్టు మొదటి వారం వరకు వర్షాలు తగ్గకపోవచ్చని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్​లో కురుస్తున్న వర్షాలకు నగరవాసులు సైతం ఇబ్బంది పడుతున్నారు.