గద్వాల, వెలుగు: రాష్ట్రంలోనే మొదటిసారి గద్వాల జిల్లా మహిళా కబడ్డీ అసోసియేషన్ ను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మహేందర్ రెడ్డి, ఆల్ ఇండియా ఒలంపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జగదీశ్వర్ యాదవ్ తెలిపారు. ఆదివారం పట్టణంలోని ఓ ఈవెంట్ హాల్ లో కబడ్డీ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు.
చీఫ్ పాట్రన్ గా పాలమూరు ఎంపీ డీకే అరుణ, పాట్రన్ గా వెంకటేశ్వర్ రెడ్డి, అధ్యక్షురాలిగా డీకే స్నిగ్ధారెడ్డి, చైర్మన్ గా అబ్రహం, సెక్రటరీగా నరసింహ, ట్రెజరర్లుగా చందు, రాములు, లీగల్ అడ్వైజర్లుగా తరుణ్, ఉపాధ్యక్షుడిగా వెంకటేశ్, భీమయ్య, నర్సింలు, గోవిందు, తిరుపతి, రాజశేఖర్, జాయింట్ సెక్రెటరీలుగా నాగేశ్, శివ, మునిరెడ్డి, కృష్ణ, ఆర్ కృష్ణను
ఎన్నుకున్నారు.