85.8 శాతానికి చేరిన ద్రవ్యలోటు

85.8 శాతానికి చేరిన ద్రవ్యలోటు

న్యూఢిల్లీ:  కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు 2025 ఫిబ్రవరి చివరి నాటికి వార్షిక లక్ష్యంలో 85.8 శాతానికి చేరుకుంది.  కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (కాగ్​) విడుదల చేసిన డేటా ప్రకారం,  ఇది  2024-–25 ఏప్రిల్–-ఫిబ్రవరి  కాలంలో రూ. 13,46,852 కోట్లుగా ఉంది. గత సంవత్సరం ఇదే కాలంలో లోటు సవరించిన అంచనాల (ఆర్​ఎ) 2023–-24లో 86.5 శాతంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ పన్ను ఆదాయం (నికరంగా) రూ. 20 లక్షల కోట్లు లేదా  2024–-25 సవరించిన అంచనాల్లో 78.8 శాతంగా ఉంది. 

ఇది గత ఆర్థిక సంవత్సరంలో 79.6 శాతంగా ఉంది. మొత్తం ఖర్చు రూ. 38.93 లక్షల కోట్లు లేదా సవరించిన అంచనాల్లో 82.5 శాతంగా ఉంది. గత సంవత్సరం ఇదే కాలంలో 83.4 శాతంగా ఉంది.  మార్చి 2025తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక లోటును రూ. 15.69 లక్షల కోట్లుగా లెక్కగట్టారు.