ద్రవ్యలోటు @ 4.8 శాతం

ద్రవ్యలోటు @ 4.8 శాతం

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీలో ద్రవ్యలోటు 4.8 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది 4.4 శాతం ఉండొచ్చని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో మార్కెట్​ నుంచి రూ.11.54 లక్షల కోట్లు అప్పులు తీసుకుంటామని వెల్లడించారు. 

నాన్​-–ఫైనాన్షియల్​ సెక్టార్లలో రెగ్యులేటరీ మార్పులు తీసుకురావడం కోసం ఉన్నత స్థాయి కమిటీని నియమిస్తామని ప్రకటించారు. కార్పొరేట్​ బాండ్లకు క్రెడిట్​ను అందించడానికి నేషనల్ ​బ్యాంక్​ ఫర్​ఫైనాన్సింగ్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ ​అండ్​ డెవెలప్​మెంట్​ ఏర్పాటు చేస్తామని ఆమె వెల్లడించారు. పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాల ఇండెక్స్​ను ఈ ఏడాదే విడుదల చేస్తామని పేర్కొన్నారు.