పెరిగిన ద్రవ్య లోటు

పెరిగిన ద్రవ్య లోటు

న్యూఢిల్లీ: మనదేశ ద్రవ్యలోటు మార్చి 2025తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి మొదటి ఆరు నెలల ముగింపులో బడ్జెట్ లక్ష్యంలో 29.4 శాతానికి పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య వ్యయాలు, రాబడి మధ్య వ్యత్యాసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 16.85 లక్షల కోట్ల మొత్తం పరిమితిలో రూ. 4.75 లక్షల కోట్లుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం మార్చి 2025తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి జీడీపీలో 4.9శాతం ద్రవ్య లోటు లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.

గత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు లక్ష్యాన్ని జీడీపీలో 5.6శాతానికి పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల నికర పన్ను వసూళ్లు రూ. 12.65 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇది ఆర్థిక లక్ష్యంలో 49 శాతం. గత ఏడాది ఇదే కాలంలో వసూలైన రూ. 11.6 లక్షల కోట్లతో పోల్చితే చాలా తక్కువ. పన్నేతర ఆదాయం సెప్టెంబర్ 2024 నాటికి రూ. 3.57 లక్షల కోట్లకు చేరుకుంది, 2025లో బడ్జెట్ అంచనా రూ. 5.45 లక్షల కోట్లలో 65.5శాతం సాధించింది.