ఖమ్మం నగరంలోని బోనకల్ రోడ్డులో రాజిరెడ్డి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈవెంట్ నిర్వాహకుడు విజయ్ పాల్ సారథ్యంలో 250 రకాల చేపలతో రూ.3.5 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేసిన ఫిష్ అక్వేరియం సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఇలాంటి అక్వేరియం దుబాయ్, మలేషియా వంటి దేశాల్లో రూ.2 నుంచి రూ.3 వేలు చెల్లించి చూడాలి. మన రాష్ట్రంలో మొదటిసారిగా ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ లలో ఈ నెల13న ఒకేసారి అక్వేరియం ప్రారంభించారు. కేవలం రూ.100 టిక్కెట్ తో ప్రజలకు అక్వేరియం చూసే అవకాశం కల్పించారు. దీనిలో రూ.2.5 లక్షల ఖర్చుతో కనిపించే ఎలక్ట్రికల్ ఫిష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అక్వేరియం లోపల ఫుడ్ కోర్ట్, చిల్ర్డన్స్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఈ వేసవిలో అక్వేరియం ప్రదర్శన నగరవాసులకు కనువిందు చేయనుంది. ఈ ప్రదర్శన జూన్ 15 వరకు కొనసాగనుందని నిర్వాహకులు చెప్పారు.
- వెలుగు ఫొటోగ్రాఫర్, ఖమ్మం