
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించిన చేప ప్రసాదం పంపిణీ ముగిసింది. రెండో రోజైన..2024, జూన్ 9వ తేదీ ఉదయం 11.30 గంటల వరకు చేప మందు పంపిణీ చేశారు. ఆ తర్వాత పంపిణీని నిలిపేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అయితే, ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం తీసుకోని వారికి.. కవాడి గూడ, దూద్ బౌలిలోని తమ నివాసల్లో పంపిణీ చేయనున్నట్లు బత్తిని సోదరులు చెప్పారు.
జూన్ 8వ తేదీని చేపమందు పంపిణీ ప్రారంభించగా.. రెండు రోజు మందే భారీగా జనాలు తరలి వచ్చారు. తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఇతర రాష్ట్రల నుంచి చేప ప్రసాదం కోసం పోటెత్తారు. ప్రసాదం కోసం 30 కౌంటర్లు ఏర్పాటు చేయగా.. వృద్దులు, మహిళలకు సపరేట్ క్యూ లైన్స్ ను ఏర్పాటు చేశారు. టోకెన్ తీసుకున్న వారికే చేప మందు ప్రసాదం పంపిణీ చేశారు. తొలిరోజు 65 వేల మందికి చేపమందు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. రెండో రోజు కూడా అధిక సంఖ్యలో వచ్చిన జనాలు చేప మందును తీసుకున్నారు.