Good Health : ఈ చేపనూనెతో ఫెర్టిలిటీ సమస్యలు దూరం.. సామర్ధ్యం పెరుగుతుందంట..!

Good Health : ఈ చేపనూనెతో ఫెర్టిలిటీ సమస్యలు దూరం.. సామర్ధ్యం పెరుగుతుందంట..!

పురుషులు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే చేప నూనె సప్లిమెంట్స్ ఎక్కువగా తీసుకుంటే ఫెర్టిలిటీ సామర్థ్యం పెరుగుతుందని తాజాగా చేసిన స్టడీలో వెల్లడైంది. యూనివర్సిటీ ఆఫ్ సదరన్ డెన్మార్క్ పరిశోధకులు 1,700 మంది యువకులపై ఈ స్టడీ చేశారు. రెగ్యులర్ గా చేప నూనె తీసుకుంటున్న పురుషుల్లో వీర్యకణాల సంఖ్య అధికంగా ఉన్నట్టు కనుగొన్నారు. అలాగే, వీళ్లలో ఫెర్టిలిటీ సంబంధిత హార్మోన్స్ అధికంగా విడుదలవుతున్నాయి. ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్' వీర్యకణాలపై ప్రభావం చూపుతున్నాయి. తమ డైట్లో చేపనూనెను తీసుకుంటున్నవాళ్లలో వీర్యకణాల సంఖ్యతో పాటు, వాటి నాణ్యత కూడా పెరిగింది' అని ఈ స్టడీకి లీడర్ గా ఉన్న ప్రొఫెసర్ టినా కోల్డ్ జెన్సన్ చెప్పారు.

వీర్య క‌ణాలు శ‌క్తివంతంగా ప‌ని చేయ‌టానికి, స్పెర్మ్ సెల్ మెంబ్రేన్ కు ఫ్యాటీ యాసిడ్ కంటెంట్ త‌ప్ప‌నిస‌రి. ఫెర్టిలైజేష‌న్ జ‌ర‌గాలంటే స్పెర్మ్ సెల్ లో ఫ్యాటీ యాసిడ్స్ క‌చ్చితంగా ఉండాల‌ని..  సెల్ మెంబ్రేన్ లో ఉండే ఒమేగా-3 శుక్ర‌క‌ణం, అండం ఫ‌ల‌దీక‌ర‌ణ జ‌ర‌ప‌డానికి తోద్ప‌డుతుంద‌ని జెన్స‌న్ తెలిపారు. 

పెర్టిలిటీ స‌మ‌స్య‌ల ఎక్కువ‌వుతున్న క్ర‌మంలో 2012 నుంచి 2017 వ‌ర‌కు  ప్రొఫెసర్ టినా కోల్డ్ జెన్సన్ టీమ్ చేసిన ప‌రిశోధ‌న‌లు జ‌రిపారు. అయితే ఈ అధ్య‌య‌నంలో పాల్గొనే వారికి దాదాపు 75 డాల‌ర్లు పారితోషికం ఇచ్చి వారి నుంచి శాంపుల్స్ తీసుకున్నార‌ట‌. వీటిపైన మ‌రిన్ని ప‌రిశోధ‌న‌లు జ‌రిపి ప్ర‌పంచ‌లో ఉన్న ఫెర్టిలిటీ స‌మ‌స్య‌ల ను ప‌రిష్క‌రించ‌నున్న‌ట్లు తెలిపారు.