బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ హయాంలో చేప పిల్లల పంపిణీలో అవకతవకలు

బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ హయాంలో చేప పిల్లల పంపిణీలో అవకతవకలు
  • పీసీసీ ఫిషర్ మెన్ కమిటీ చైర్మన్ సాయి కుమార్ ఆరోపణలు

హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేప పిల్లల పంపిణీలో అవకతవకలు జరిగాయని పీసీసీ ఫిషర్ మెన్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆరోపించారు. సోమవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అసలైన మత్స్యకారులకు అన్యాయం జరిగిందని, మత్స్యశాఖలో రూ.500 కోట్లు, గొర్రెల పంపిణీలో రూ.700 కోట్ల స్కామ్ జరిగిందని తెలిపారు.

మత్స్యశాఖలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ విచారణ జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వ డబ్బును దోచుకున్న దొంగలను వదిలే ప్రసక్తి లేదని పేర్కొన్నారు. బాధ్యులైన వారు కటకటాల్లోకి పోవడం ఖాయమని హెచ్చరించారు.