మేం అసలైన హిందువులం.. బీజేపీ నేతలుఎన్నికల హిందువులు

మేం అసలైన హిందువులం.. బీజేపీ నేతలుఎన్నికల హిందువులు
  • రాజాసింగ్​కు ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కౌంటర్

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ వాళ్లే అసలైన హిందువులని, బీజేపీ నేతలు ఎన్నికల హిందువులని రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి ఆరోపించారు. సోమవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తమకు హిందూత్వన్ని  నేర్పాల్సిన అవసరం లేదని, తమ కుటుంబాలు హిందూ సంప్రదాయాలు, సంస్కృతిని నేర్పాయని తెలిపారు.

 హిందూత్వన్ని రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడమే బీజేపీ పని అని, ఎన్నికల తర్వాత హిందువులను టిష్యూ పేపర్ లా తీసేస్తారని ఆరోపించారు. గొడవలు సృష్టించి ఎన్నికల్లో ఓట్లు తెచ్చుకోవడమే బీజేపీ పని అని విమర్శించారు.