కల్వకుంట్ల కుటుంబం కాదు.. కల్వ కుట్రల కుటుంబం : ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి ధ్వజం

కల్వకుంట్ల కుటుంబం కాదు.. కల్వ కుట్రల కుటుంబం : ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి ధ్వజం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను కల్వకుంట్ల కుటుంబం కుట్రపూరితంగా అడ్డుకుంటుందని, అందుకే ఇది కల్వకుంట్ల కుటుంబం కాదని, కల్వకుట్రల కుటుంబమని రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి ఆరోపించారు. శనివారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.

సీఎం కుర్చీ నుంచి రేవంత్ రెడ్డి దిగిపోవాలని కేటీఆర్ పదే పదే విమర్శిస్తున్నరని, దిగిపోమ్మంటే దిగిపోవడానికి ఇది కేటీఆర్ ఇచ్చిన అధికారం కాదని, ప్రజలు ఇచ్చిన అధికారమని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పాలనలో పదేండ్ల పాటు జరిగిన అరాచకాలు, దుర్మార్గాలు, అవినీతి, అక్రమాలను భరించలేకనే ప్రజలు కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారని గుర్తు చేశారు. సీఎం కుర్చీ నుంచి తండ్రి దిగిపోగానే కొడుకు అందులో కూర్చోవడానికి ఇది కారుణ్య నియామకం కాదని వివరించారు.