మోతే చెరువు కబ్జాకు యత్నం అడ్డుకున్న మత్స్యకారులు

మోతే చెరువు కబ్జాకు యత్నం అడ్డుకున్న మత్స్యకారులు

జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల పట్టణానికి ఆనుకుని ఉన్న మోతే పెద్ద చెరువు ఎఫ్‌‌‌‌టీఎల్‌‌‌‌ పరిధిలో మట్టి పోసి కబ్జా చేస్తుండగా గ్రామానికి చెందిన గంగపుత్రులు సోమవారం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మత్యకారులు మాట్లాడుతూ జగిత్యాల పట్టణానికి చెందిన ఓ కౌన్సిలర్ ఎఫ్‌‌‌‌టీఎల్‌‌‌‌ పరిధిలోని చెరువులో మట్టిని నింపి కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. 

ఇప్పటివరకు ఎఫ్‌‌‌‌టీఎల్‌‌‌‌ పరిధిలో సుమారు 20ఎకరాలు కబ్జాకు గురయ్యాయన్నారు. అధికారులు స్పందించి ఎఫ్‌‌‌‌టీఎల్‌‌‌‌ పరిధిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని డిమాండ్ చేశారు.