- జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
వరంగల్: మత్స్యకారుల సొసైటీలకు 50 లక్షలు విడుదల చేయాలంటూ నిధుల కోసం ప్రభుత్వానికి నివేదిక పంపాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. మత్స్యకారులకు అధికారులు సకాలంలో సమృద్ధిగా చేప పిల్లలు పంపిణీ చేయట్లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ మత్స్యకారులకు శిక్షణ కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని అధికారులను కోరారు. ప్రభుత్వం ఇచ్చిన చేప పిల్లలను అధికారులు సమృద్ధిగా సకాలంలో పంపిణీ చేయట్లేదన్నారు.
మత్సకార్మికులకు స్పెషల్ డ్రైవ్ల కోసం ప్రభుత్వ సహకారంలో ప్రజా ప్రతినిధుల కృషి ఉంటుందని ఆయన తెలిపారు. నిండు కుండల్లా ఉన్న చెరువులతో మత్సకార్మికులకు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మత్స్యకారులకు సభ్యత్వాల కోసం ఎలాంటి పైరవీలు లేకుండా సభ్యత్వం కల్పించాలన్నారు.