
పాల్వంచ, వెలుగు : ఫిషరీస్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో పట్టణంలోని రాతి చెరువులో పెంచుతున్న చేపలు చనిపోతున్నాయి. ఆదివారం చెరువులోని బతుకమ్మ ఘాట్ వద్ద సుమారు రెండు కిలోల సైజు ఉన్న చేపలు చనిపోయి నీటిలో తేలాయి. పట్టణంలోని ప్రధాన మార్కెట్ తో పాటు పలు సమీప ప్రాంతాల నుంచి డ్రైనేజీ నీరు వచ్చి ఈ చెరువులో కలుస్తోంది. దీంతోనే చేపలు చనిపోతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.